కంగనా పెళ్లి ఖాయమైందా ?

Sharing is Caring...

Career down ………………

హీరోయిన్లు గొడవలకు , కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. సినిమా చేశామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్లు సైలెంట్‌గా ఉంటారు. కొందరు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు కెక్కుతూ ఉంటారు.అందులో బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్ ప్రసిద్దురాలు.

గత కొన్నాళ్లుగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు చిరునామాగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ అయిందని వార్తలొస్తున్నాయి .2006 లో బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన కంగనా రనౌత్.. తెలుగులో ప్రభాస్ హీరోగా చేసిన ‘ఏక్ నిరంజన్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. అది పెద్దగా ఆడకపోవడంతో తెలుగు సినిమా ల్లో ఆఫర్లు రాలేదు.

నటిగా హిందీలో అద్భుతమైన సినిమాలతో గుర్తింపు సంపాదించుకుంది. జయలలిత బయోపిక్ తలైవి ఆమెకు మంచిపేరు తెచ్చింది. అదే టైంలో పలు గొడవల్లోనూ తనదైన శైలిలో రెచ్చిపోయింది. హృతిక్‌తో రిలేషన్, ఖాన్ త్రయంపై కామెంట్స్ కావొచ్చు ఇలా పలు సందర్భాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

గత కొన్నాళ్లుగా కంగన సినిమా కెరీర్ డల్ అయింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం లేదు. చంద్రముఖి 2′ అనే సినిమా సెప్టెంబర్ 28 న విడుదలయింది.ఈ సినిమాపై టాక్ మిశ్రమంగా ఉంది. హిందీలో ‘తేజస్’, ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రాల్లో నటించింది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి. ‘ఎమర్జెన్సీ’ లో ఇందిరాగాంధీ పాత్రను చేసింది. వచ్చే నవంబర్ 24 న ఈ సినిమా విడుదల అవుతుంది.   

మొత్తం మీద కెరీర్ కాస్త డౌన్ కావడంతో కంగన పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. ఒక్కో సినిమాకు 15 కోట్లు తీసుకునే 37 ఏళ్ళ కంగనా ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకోబోతుందని, ఈ ఏడాది డిసెంబరులో నిశ్చితార్థం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. కంగనా ఈ వార్తను ధ్రువీకరించాల్సిఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!