Hanging pillar…….
లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్‌ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే కామాక్షి అమ్మన్ దేవాలయం అని కూడా అంటారు.స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని కూడా పిలుస్తారు .
ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మితమైంది. అద్భుత శిల్ప సంపదకు ఈ ఆలయం నెలవు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ గురుత్వాకర్షణను ధిక్కరించే హాంగింగ్ పిల్లర్. ఈ మిస్టరీని ఎవరూ తేల్చలేకపోయారు .
ఆలయం లోని అర్ధ మండపంలో గర్భ గుడి పక్కనే 4 స్థంభాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వేలాడుతోంది.భూమికి స్థంభానికి మధ్య గ్యాప్ 2 సెంటీమీటర్లు ఉంటుంది.బాగా వంగి చూస్తే గ్యాప్ లోని స్థలం కనిపిస్తుంది.
న్యూస్ పేపర్ ను అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు లాగవచ్చు.ఈ వేలాడే స్తంభాన్ని ఎంతో మంది ఆర్టిటెక్ట్ నిపుణులు సందర్శించి వెళ్లారు. అదొక అద్భుతం అన్నారు కానీ నిర్మాణంలోని రహస్యం ఏమిటి అనేది చెప్పలేదు.
ఈ మల్లికార్జునేశ్వర ఆలయ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే .. నొలంబ రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లో శిల్పకళా అద్భుతం. అన్నిచోట్లా అరుదైన శిల్పాలు కనిపిస్తాయి.
ప్రాంగణంలో ‘కామాక్షి అమ్మన్ ఆలయం’ కూడా ఉంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో గోడలపై రామాయణ కథను బొమ్మల రూపంలో చెక్కారు. యాత్రీకులను ఈ శిల్పాలు ఆకట్టుకుంటాయి. ‘కార్తికేయ మందిరం’ కూడా ఉంది.
ఈ ఆలయం సేలం నుండి: 66 కి.మీ,బెంగళూరు నుండి: 127 కి.మీ .. ఈరోడ్ నుండి: 114 కి.మీ దూరంలో ఉంది. బస్సు , రైలు మార్గం లో చేరుకోవచ్చు.ధర్మపురి లో వసతి సౌకర్యాలు ఉన్నాయి. ప్లాన్ చేసుకుని వెళితే చుట్టు పక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలను చూసి రావచ్చు.