The long journey has begun……………………………….
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర ఇవాళ ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో రాహుల్ హోటళ్ళలో బస చేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓస్పెషల్ బస్ లో బస చేయబోతున్నారు.
ఈ క్యారవాన్ లో నిద్రపోవడానికి తగిన సదుపాయాలు, మరుగుదొడ్లు, ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ఈ క్యారవాన్ లో ఎగ్జిక్యూటివ్‌ల కోసం బెడ్‌రూమ్, ఆఫీసు, మీటింగ్ ,కన్సల్టింగ్ ఏరియా ఉండే విధంగా రూపొందించారు.
రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణకు ఒక స్పెషల్ టీమ్ పనిచేస్తున్నది. యాత్ర ముగిసేవరకు ఈ టీమ్ రాహుల్ వెంట ఉంటుంది. ఇక రాహుల్ పాదయాత్రలో 150 మంది నాయకులు కూడా పాల్గొంటారు. అందరికి భోజనం, టిఫిన్లు ఇతర సదుపాయాలు సమకూరుస్తున్నారు.
యాత్రలో పాల్గొనే నాయకుల కోసం కూడా ఏసీ సౌకర్యంతో బెడ్ రూమ్, టాయిలెట్ సహా అన్నివసతుల తో కూడిన 60 క్యారవాన్ లను ఉపయోగిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల బస కోసం మరో 30 క్యార్వాన్లను వినియోగిస్తున్నారు. మరి కొన్ని క్యార్వాన్‌లు వంటవారితో సహా సిబ్బందికి కేటాయించారు.
ద్వితీయ శ్రేణి నేతల కోసం ఏర్పాటు చేసిన కార్వాన్‌లలో 4 పడకలుంటాయి. ఒక్కో కారవాన్‌లో నలుగురు ముఖ్యులు ఉంటారు. రాహుల్ గాంధీ బస చేసిన క్యారవాన్‌లో కేవలం రెండు లగ్జరీ బెడ్‌లు ఉంటాయి. రాత్రిళ్ళు భద్రత ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తున్నారు. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజలతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకోవడానికి రాహుల్ ఈ పాదయాత్ర చేస్తున్నారు.