Padmakar Daggumati ………………
ఫేస్‌బుక్ లో అక్కడ ఇక్కడ ఏదేదో చదివి రాత్రి “క” సినిమాకి వెళ్లాను. మూస కథనానికి భిన్నంగా సినిమా మొత్తంలో ఎవరి పనితనం వాళ్లు చూపించారు. ముఖ్యంగా మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా పనితనం ఆ బడ్జెట్ సినిమాకి ఎక్స్‌లెంట్ గా ఉంది. హీరో, హీరోయిన్ ల నటన కూడా బాగుంది.
ఐతే…
ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు “కాంతారా” సినిమా గుర్తొస్తూనే ఉంది. ఆ కథకి ఈ కథకి ఎలాంటి సంబంధం లేదు కూడా. అయితే స్క్రిప్ట్ ప్లానింగ్ మాత్రం కాంతారాని పక్కన పెట్టుకుని చేసినట్టే అనిపించింది. అఫ్కోర్స్, కనీసం దర్శకులు ఇద్దరిమీద కాంతారా ప్రభావం అయినా ఉండివుండాలి..
సస్పెన్స్ కథ, మేజిక్ రియలిజం కథనం, డిఫరెంట్ లేయర్స్ ఉండడం, జోవియల్ హీరో, గ్రామీణ నేపథ్యం, క్లైమాక్స్ బ్యాంగ్.. ఇదే స్ట్రక్చర్ రెండు సినిమాలలో ఉండడంతో నాకు కాంతారా గుర్తొచ్చింది. విజయవంతమైన అదే కోవలో ఈ సినిమా స్ట్రక్చర్ మరింత బిగువుగా సాగింది. రెండు సినిమాలు చూసినవాళ్లలో మీకు ఎవరికైనా కాంతారా గుర్తొస్తే చెప్పండి.
నిజంగా ఈ సినిమా తెలుగు సినిమా నిర్మాణం కౌశంలం ఒక కొత్త రేంజ్ లో నిలబెట్టింది అనడంలో సందేహం లేదు. చివర్లో లేడీ విలన్ అరాచకం విషయంలో కాస్త తేలిపోయినట్టు అనిపించినా, ఐప్పటివరకు నడిపించిన ఆసక్తికరమైన కధనం కారణంగా ప్రేక్షకులు దీన్ని ఈజీగా మర్చిపోతారు కూడా
.
హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అక్టోబర్ 31న విడుదలైన ‘క’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ట్రెండ్ ఇలాగే కొనసాగవచ్చు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమా కు అనుకూల అంశం.
ఈ సినిమాతో సుజిత్-సందీప్ దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇదే రీతిలో మంచి కథలతో సినిమాలు తీస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హీరో విషయానికొస్తే తనని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఎదగడం కొంతమందికి ఇష్టం లేదంటూ సినిమా రిలీజ్ కి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే, సినిమాలే మానేస్తానని ఛాలెంజ్ కూడా చేసాడు. ఆ ప్రభావం కొద్దిగా వర్క్ అవుట్ అయి ఉండవచ్చు. ఏదైనా కథ నచ్చక పోతే పెద్ద హీరోల సినిమాల ఢమాల్ అన్న ఉదాహరణలు లేకపోలేదు. కాబట్టి హీరోలు కథకు ప్రాధాన్యత ఇవ్వడం అలవర్చుకోవాలి. ఛాలెంజ్ చేయడం కాదు.