ప్రపంచ బడా భూస్వామి !!

Sharing is Caring...

So many crores of assets………..

ఈ ఫొటోలో ఉన్న ప్రముఖుని గురించి పరిచయం చేయనక్కర్లేదు..కింగ్ చార్లెస్- III కి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన భవన సముదాయాలు ఆయన సొంతం.

సముద్ర తీరప్రాంతాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన కున్న భూములు, ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ది క్రౌన్ ఎస్టేట్ అనే కంపెనీ కూడా ఉంది.ఈ అపార ఆస్తిపాస్తులు బ్రిటన్ రాజకుటుంబానికి సొంతం. ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్- II మరణం తరువాత కింగ్ చార్లెస్ ప్రపంచంలోనే భారీ ఆస్తిపాస్తులకు యజమానిగా మారారు. ఆయన బతికి ఉన్నంత వరకూ ఈ ఆస్తిని అతని సొంత ఆస్తిగా పరిగణిస్తారు. దీనికి అతను ప్రైవేట్‌ యజమాని కాదు.

బ్రిటన్ మీడియా సమాచారం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రపంచవ్యాప్తంగా 6.6 బిలియన్ ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ భూములు గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం సంపదలో 16.6 శాతం ఈ బ్రిటిష్ రాజుకు చెందినవే అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

ఇంకా ఆయనకు రాయి, గ్రానైట్, ఇటుక, మట్టి, బొగ్గు, స్లేట్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి. 2022 సెప్టెంబరులో కింగ్ చార్లెస్- III సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతను $46 బిలియన్ల సామ్రాజ్యానికి అధిపతి. (ఒక బిలియన్‌ అంటే రూ. 100 కోట్లు) ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్‌లో ఉంది. కింగ్ చార్లెస్- III తరువాత అత్యధిక భూముల కలిగిన వ్యక్తిగా సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా నిలిచారు. ఈయనకు ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది.మరెన్నో ఆస్తులు ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!