తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చేనా ?

Sharing is Caring...

Will they change…………………………………………షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉంటుందని తాలిబన్ నాయకులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్ ను ఎలా నడిపించాలనే అంశంపై ఇంకా నాయకత్వంలో చర్చలు జరుగుతున్నాయని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హష్మీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన ఉండదని తేల్చి చెప్పారు. తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా దేశాధినేతగా ఉంటారని హష్మీ అంటున్నారు. హష్మీ చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే తాలిబన్ల వ్యవహార శైలిలో మార్పులు ఉండవనే ఆఫ్ఘన్ ప్రజలు భావిస్తున్నారు.

1996-2001 నాటి తరహా పాలనే పునరావృత్తమౌతోందని అంచనా వేస్తున్నారు.ఆఫ్గనిస్తాన్నుస్వాధీనం చేసుకున్నప్పటి నుంచి కొద్దీ రోజులు దూకుడు తగ్గించినప్పటికీ మరల వారు సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ విధ్వంసకాండకు తెర లేపారు. పలుచోట్ల హింసాకాండకు పాల్పడ్డారు. నిరసన ప్రదర్శనలపై విరుచుకు పడుతున్నారు. కొందరి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ తీరు చూస్తుంటే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చే సూచనలు లేవనే చెప్పుకోవాలి. అందుకే లక్షల్లో ప్రజలు దేశం వదిలి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.

అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే ఇక పాలన మొదలైతే చుక్కలు చూపిస్తారని  ఆఫ్ఘన్ ప్రజలు ఉన్నారు. మిలిటరీ నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎక్కి … ఆధునాతన ఆయుధాలతో కొందరు … వాహనాలు లేకుండా ఆయుధాలతో కొందరు రోడ్లపై సంచరిస్తున్నారు.ఇదిలా ఉంటే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఏప్రిల్ లో ప్రకటన చేసిన నాటి నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా ఆక్రమణకు అనువుగా ఉన్న ప్రాంతాలపై కన్నేశారు.

జూన్ నుంచే జిల్లాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. జులై నాటికి 100 జిల్లాలను స్వాధీన పరుచుకున్నారు. సైనికులను తరిమి కొట్టారు. వారి ఆయుధాలను తీసుకున్నారు. అలా మెల్లగా కీలక నగరాలను చేజిక్కించుకున్నారు. తర్వాత ఎయిర్ బేస్ .. మిలిటరీ స్థావరాలపై దాడులు చేశారు. సైన్యం చేతులెత్తేయడం తో విమానాలను ,హెలీకాఫ్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అమెరికా అత్యాధునిక ఆయుధాలు వారి వశమైనాయి.

గత 20 ఏళ్లలోదాదాపు 89 బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు ,విమానాలు,హెలికాఫ్టర్లు,యుద్ధ ట్యాంకర్లు 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్థాన్ కు  అమెరికా సమకూర్చింది. వీటిని ఉపయోగించడంలో అమెరికా ఆఫ్ఘని సైనికులకు శిక్షణ కూడా ఇచ్చింది. అయినప్పటికీ సైనికులు తాలిబన్లతో పోరాడకుండానే పలాయనం చిత్తగించారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందే తాలిబన్లు యుఎస్ దళాలు వాడిన ఆధునిక తుపాకులు, బాడీ ఆర్మర్ సూట్లు ధరించి,వాహనాలతో తాలిబాన్లు తిరుగుతున్నారు. UH-60 బ్లాక్ హాక్ అటాక్ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తున్న కొన్ని వీడియోలు కూడా ప్రచారంలో కొచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఈ ఛాపర్ పక్కన నిలబడి ఉన్న చిత్రాలు బయట కొచ్చాయి.కాగా తాలిబన్లకు సరాఖేటా దళాలు సహకరించాయి. ఈ దళాలనే అరుణ దళాలుగా పిలుస్తున్నారు. మొత్తం మీద ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!