నారప్ప ‘అసురన్’ను మరిపిస్తాడా ?

Sharing is Caring...

తమిళ చిత్రం అసురన్ ఆధారంగా తెలుగులో నారప్ప సినిమా తీశారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఈ అసురన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అవార్డులను కూడా సాధించింది. బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ప్రూవ్డ్ సబ్జెక్టు కాబట్టి దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది.  తెలుగు నేటివిటీ కి తగ్గట్టు మార్పులు చేసినట్టు చెబుతున్నారు. అవేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది.

వాస్తవానికి అసురన్ కథను పోలిన సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జరిగాయి. సినిమా గా తీయతల్చుకుంటే ఇంకా ఎన్నో కథలున్నాయి. కానీ హిట్ అయిన సినిమాల పైనే మన నిర్మాతలు దర్శకులు ఎక్కువగా దృష్టి పెడతారు. చాలాకాలం నుంచే ఈ పద్ధతి నే  తెలుగు నిర్మాతలు అనుసరిస్తున్నారు. అలాకాకుండా తీసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాకపోతే హీరో ఇమేజ్ కి తగ్గట్టు కథను మారుస్తారు. దీంతో కథలో సహజత్వం లోపిస్తుంది. అలా కాకుండా సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమాలు కూడా ఉన్నాయి ఉదారణకు ఎర్ర మందారం వంటి సినిమాను చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక నారప్ప విషయానికొస్తే హీరో వెంకటేష్ తన ఇమేజ్ కి భిన్నంగానే నటిస్తున్నారు. ఆ పాత్ర గమనాన్ని .. ఆహార్యాన్ని ఏమాత్రం మార్చినట్టు లేరు. అది చెప్పుకోదగిన విషయమే.

ఇక అసురన్ తో నారప్పను ప్రతి అంశంలోనూ పోల్చి చూస్తారు. అసురన్  చూసిన వాళ్లకు ఈ సినిమా కార్బన్ కాపీ అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే అలాగే ఉంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే యధాతధంగా తీసినట్టు అనిపిస్తుంది. అసురన్ చూడని ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. అందులో డౌట్ లేదు.అలాగే ధనుష్ నటనను వెంకటేష్ నటనను పోల్చికూడా చూస్తారు. అసురన్ లో కొన్నిసన్నివేశాలను వెట్రిమారన్ అద్భుతంగా తెరపైకి ఎక్కించారు.ఆస్థాయిలోనారప్ప దర్శకుడు శ్రీకాంత్ చిత్రీకరించారో,లేదో చూడాలి.

మాతృక లోని విషయాన్నీ గమనించకుండా యధాతధం గా తీస్తే అది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. శ్రీకాంత్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఏమార్పులతో జనాలను ఆకట్టుకుంటారో ? చూడాలి. హీరో వెంకటేష్ ఇటీవల కాలంలో రొటీన్ కి భిన్నమైన పాత్రలే చేస్తున్నారు. ఈ నారప్ప గెటప్ బాగుంది. అభిమానులను అలరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది సక్సెస్ అయితే భవిష్యతులో మరిన్నివిభిన్న పాత్రల్లో వెంకటేష్ నటించే అవకాశం లేకపోలేదు. సురేష్ మూవీస్ కి చాలాకాలంగా హిట్స్ లేవు. ఈ సినిమా ఆ కొరత ను తీరుస్తుందో లేదో చూద్దాం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!