Ghost Guns………………………………………………………
ఘోస్ట్ గన్స్ అంటే… దెయ్యం తుపాకులు కాదండోయి. లైసెన్సు లేకుండా అక్రమంగా తయారు చేసే తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’ అంటుంటారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్నసైజు ఫ్యాక్టరీలలో కూడా తయారు చేయవచ్చు. విడి భాగాలను కొనుక్కొని అసెంబుల్ చేసుకోవచ్చు. ఈ ఘోస్ట్ గన్లకు లైసెన్స్ గట్రా ఉండవు. వాటికి సీరియల్ నెంబర్స్ ఉండవు. ఎక్కడ తయారైనాయో కూడా ఎవరికి తెలీదు.
వీటిని అమ్మడం …కొనడం నేరమే. … ఇది ఇల్లీగల్ వ్యాపారం .. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ చట్టాల్లోని లొసుగులతో.. ఆన్ లైన్ లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్ ను అమ్ముతుంటారు. రకరకాల తుపాకులకు సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేసే వీలుంది.
చాలా దేశాల్లో ఈ ఘోస్ట్ గన్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కోట్లలో వ్యాపారం జరుగుతోంది. లోకల్ చట్టాల ప్రకారం ఘోస్ట్ గన్స్ ను కలిగి ఉండడం నేరం గానే పరిగణిస్తారు. స్వల్పకాలిక లేదా కఠిన జైలు శిక్ష, జరిమానా వంటి శిక్షలు వేస్తుంటారు. ఘోస్ట్ గన్‌ల నియంత్రణ కష్టం. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండానే విక్రయిస్తారు.
కిరాయి హంతకులు .. నేర స్వభావం గలవారు ఈ ఘోస్ట్ గన్స్ తో హత్యలకు పాల్పడుతున్నారు. అమెరికా లో రెండు రోజుల కిందట ఘోస్ట్ గన్ ఉపయోగించి 18 ఏళ్ళ కుర్రోడు ఒక స్కూల్లో కి జొరబడి 19 మంది పిల్లలను ఇద్దరు టీచర్లను కాల్చేసాడు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఎన్నో జరిగాయి.
అమెరికా లో 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువ. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్ గన్స్ దొరికాయి.
కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నక్రమంలో బైడెన్ ప్రభుత్వం ఘోస్ట్ గన్స్ కట్టడికి ఏప్రిల్ లో ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఘోస్ట్ గన్స్ నిషేధ చట్టం కోసం ఏడాది సమయం తీసుకుని.. రాజకీయంగా ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. విడి భాగాల కంపెనీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సాహసోపేతమైన అడుగు వేసింది బైడెస్ ప్రభుత్వం.
ఈ చట్టం ప్రకారం.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం కఠినాతికఠినమైన నేరంగా కిందకు వస్తుంది. అలాగే ఘోస్ట్ గన్స్ సరఫరా, విడిభాగాలను అందించే వాళ్లకు కూడా సమాన శిక్ష పడుతుంది. ఈ భయంతో అయినా ఈ వ్యవహారానికి చెక్ పడుతుందని భావించారు.
అయినప్పటికీ చట్టం అమలులో ఘోర వైఫ్యలాన్ని చవిచూస్తోంది బైడెన్ సర్కార్. నిత్యం ఎక్కడో ఒక చోట ఘోస్ట్ గన్స్ వ్యవహారాలు బయటపడుతున్నాయి. యథేచ్చగా ఘోస్ట్ గన్స్ మార్కెట్లో ఇల్లీగల్ గా అమ్ముడుపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.