అణు బాంబు పేలితే ?

Sharing is Caring...

Damages with atomic bomb…………………………..

అణ్వాయుధాలతో నష్టాలు అన్ని ఇన్నీ కాదు. అణ్వాయుధాల‌తో భారీ వినాశ‌నాన్ని సృష్టించ‌వ‌చ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అణ్వాయుధం  సైజ్.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోట‌నం చెందింది.. స్థానిక వాతావ‌ర‌ణం ఎలా ఉంద‌న్న అంశాల‌పై ఆ బాంబు ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు.

న్యూక్లియ‌ర్ వెప‌న్స్‌ను కిలోట‌న్నుల్లో పోలుస్తారు.  వంద కిలోట‌న్నుల  అణు బాంబు పేలితే .. ఆ పరిసరాల్లో దాదాపు 1.8 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు పూర్తిగా నాశ‌నమవుతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా ఉండొచ్చు. ఇక 3 కిలోమీట‌ర్ల రేంజ్ వ‌ర‌కు న‌ష్టం తీవ్రంగా ఉంటుంది. 5 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు భారీ న‌ష్టం ఉంటుంది.

బాంబు ప‌డిన ప్ర‌దేశం నుంచి 8 కిలోమీట‌ర్ల రేంజ్ వ‌ర‌కు ఏదో ఒక నష్టం తప్పదు. బాంబు ప‌డిన ప్ర‌దేశాన్ని అగ్నిగోళంతో పోలుస్తారు. ఆ ప్ర‌దేశంలో ఉన్న భవనాలు… వ‌స్తువులు మాడి మసై పోతాయి.  బాంబు ప్రభావంతో ప్ర‌జ‌లు కూడా కాలి పోతారు. పేలుడు తీవ్ర‌తతో ఆ ప్రాంతంలో మ‌నుషులు చ‌నిపోతారు. కొద్దీ మంది మాత్రమే బ్ర‌తికే అవకాశం ఉంటుంది.

కొన్ని బిల్డింగ్‌లు స్వ‌ల్పంగా ధ్వంసం కావచ్చు.అణుబాంబుల వ‌ల్ల రేడియేష‌న్ విడుదల అవుతుంది.  దీంతో మాన‌వ శ‌రీర క‌ణాలు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. రేడియేష‌న్ సిక్‌నెస్ ఏర్పడుతుంది. ఎల‌క్ట్రోమ్యాగ్నిటిక్ ప‌ల్స్ వ‌ల్ల‌.. బాంబు పేలిన ప్ర‌దేశానికి చాలా దూరం వ‌ర‌కు ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల‌న్నీ పాడైపోతాయి. బాంబు పేలిన 15 నిమిషాల త‌ర్వాత నేల‌పై రాలి ప‌డే బూడిద‌, మ‌ట్టి వ‌ల్ల కూడా తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త కలుగుతుంది.

చిన్న‌సైజు వార్‌హెడ్ పేలినా కూడా భారీ న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం జరుగుతుంది.  ప్రాణ‌హాని ఎక్కువగా  ఉంటుంది. వాటి ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా  ఉంటాయి. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో జ‌పాన్‌లోని హిరోషిమాపై ప‌డిన అణు బాంబు బ‌రువు 15 కిలో ట‌న్నులు. ఆ బాంబు వ‌ల్ల ల‌క్షా 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌స్తుతం ర‌ష్యా, నాటో దేశాల వ‌ద్ద వెయ్యి కిలో ట‌న్నుల బ‌రువున్న అణు బాంబులు ఉన్నాయి. అణు బాంబు ప‌డిన చోట మ‌నుషులు బ్ర‌తికే అవకాశం తక్కువ. క‌ళ్లు మూత‌లుప‌డే ఫ్లాష్ త‌ర్వాత వ‌చ్చే అగ్నిగోళం, ప్ర‌కంప‌న‌ల‌తో బిల్డింగ్‌లు పూర్తిగా ధ్వంసం అవుతాయి. 

కాగా అణ్వాయుధాల వ్యాప్తిని, యుద్ధాన్ని నివారించాలని చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ గతంలో ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఐదు దేశాల ఉమ్మడి ప్రకటనను రష్యా నే  ప్రకటించింది. కానీ దాన్ని విస్మరించి పుతిన్ అందరిని బెదిరిస్తున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!