వ్యోమగామి అంతరిక్షం లో మరణిస్తే ?

Sharing is Caring...
Space Deaths.......................... 

అంతరిక్షం (space)లో అడుగు పెట్టడమంటే మామూలు విషయం కాదు ..అందుకు పెద్ద సాహసమే చేయాలి. ఇందుకు గాను సుదీర్ఘ కాలం శిక్షణ పొందాలి. ఆ తర్వాత అంతరిక్షంలోకి పంపుతారు.  అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల ముందు నుంచి జరుగుతోంది. 

ఈ అన్వేషణలో భాగంగానే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ అంతరిక్ష ప్రయాణాల్లో ఇప్పటివరకు 21 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.  వ్లాదిమిర్ కొమరోవ్ అంతరిక్షంలో మరణించిన మొదటి వ్యోమగామి. 1967 లో 23 ఏప్రిల్ న సోవియట్ సోయుజ్-1 వ్యోమనౌకలో  కొమరోవ్ ప్రాణాలు కోల్పోయారు.  నాసా .. సోవియట్ రష్యా నిర్వహించిన ప్రయోగాల్లో వీరంతా మరణించారు. 

అయినప్పటికీ ప్రయోగాలు ఆగలేదు.ఒకప్పటితో పోలిస్తే ఇపుడు అంతరిక్ష యాత్రలు సర్వసాధారణంగా మారాయి. చాలామంది అంతరిక్షంలోకి వెళ్లి క్షేమంగా వెనక్కి తిరిగి వస్తున్నారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై సెలవులను ఆస్వాదించే రోజులు కూడా రావచ్చు. నాసా 2025 నాటికి చంద్రుడి పైకి తమ సిబ్బందిని పంపించాలానే యోచనలో ఉంది. 

దశాబ్ద కాలంలో అంగారకుడి పైకి వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, మార్గమధ్యంలో  ఎవరైనా చనిపోతే..? వారిని భూమికి ఎలా తీసుకొస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాసా ప్రోటోకాల్‌ రూపొందించింది. దాని ప్రకారం  ………అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఎవరైనా వ్యోమగాములు మరణిస్తే.. సిబ్బంది ఆ మృతదేహాన్ని స్పేస్‌ కాప్య్సూల్‌ ద్వారా భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది. 

దానిలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గది ఉంటుంది. శరీరానికి కావాల్సిన స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే, అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక, భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో శరీరాన్ని తీసుకురాగలిగే వీలు ఉంటుంది.చంద్రుడిపై మరణం సంభవిస్తే మృతదేహాన్ని భూమి మీదకు తీసుకు వచ్చేందుకు కొన్ని రోజులు పడుతుంది.

ఒక వేళ అంగారక గ్రహా యాత్రలో చనిపోతే.. మృతదేహాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ మిషన్‌ పూర్తి అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంటే దేహాన్ని తీసుకువచ్చేందుకు కొన్ని ఏళ్లు కూడా పట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.వ్యోమగామి స్పేస్‌సూట్‌ లేకుండా అంతరిక్షంలో అడుగుపెడితే తక్షణమే ప్రాణాలు కోల్పోతాడు.ఆక్సిజన్‌ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు.

అంతేకాకుండా రక్తంలో వేడి పెరిగిపోతుంది. దీంతో కొద్ది క్షణాల్లోనే మరణం అనివార్యమవుతుంది. ఈ అంశాలపై వ్యోమగాములకు అవగాహన కల్పిస్తారు.భూమిపై శరీరాన్ని ఖననం చేస్తే.. కీటకాలు మృతదేహాన్ని కుళ్లిపోయేలా చేస్తాయి. 

కానీ.. అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే.. అప్పుడు ఏం జరుగుతుందంటే.. శరీరంలోని బాక్టీరియా వల్ల గ్రహ ఉపరితలం కలుషితమౌతుంది. అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన  బ్యాగ్‌లో   డెడ్ బాడీని  భద్రపరుస్తారు. అందుకు ఏర్పాట్లు చేసుకునే స్పేస్ షిప్ ప్రయాణం మొదలుపెడుతుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!