“తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తెస్తాం” .. షర్మిల

Sharing is Caring...

తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తీసుకొస్తామని  దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ఆర్ ‌కుమార్తె షర్మిల ప్రకటించారు. దీంతో షర్మిల పార్టీ పెట్టే  విషయం ఖరారు అయినట్టే అని భావించవచ్చు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం అయ్యారు.  తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొన్నాళ్లుగా మీడియా లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా జగన్ వ్యతిరేక మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగింది. ఆ మీడియా చెప్పినట్టే షర్మిల పార్టీ పెట్టేందుకు షర్మిల సిద్ధమయ్యారు.ఇక షర్మిల పార్టీ లో ఎవరెవరు చేరతారు ? ఏమిటి ?అనేది మరికొద్దిరోజుల్లో తేలుతుంది. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారు ? ఎవరికి మద్దతుగా పార్టీ పెడుతున్నారు అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. కాగా రెడ్డి సామాజిక వర్గం,క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అండగా నిలుస్తాయని  షర్మిల భావిస్తున్నట్టు చెబుతున్నారు. 

ఇక ఈ  అంశంపై వైసీపీ నేతలంతా మౌనం గా ఉన్నారు. జగన్ అసలు ఏమి మాట్లాడలేదు. సాక్షి మీడియా షర్మిలను అసలు పట్టించుకోలేదు. కాగా ” తెలంగాణ లో రాజన్న రాజ్యం లేదు.  వైఎస్ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది”అని షర్మిల మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. దీన్ని బట్టి షర్మిల కేవలం తెలంగాణా రాజకీయాలపైనే దృషి పెట్టనున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక పార్టీ పెట్టడమే తరువాయని చెబుతున్నారు. పార్టీ ఎజెండా .. జెండా తదితర అంశాలపై షర్మిల నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు. వైఎస్ ఆర్ తెలంగాణా కాంగ్రెస్ పేరిట పార్టీని రిజిస్టర్ చేయవచ్చని తెలుస్తోంది ఇక  తెలంగాణలో ఒకప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారంతా ప్రస్తుతం తెరాస లో ఉన్నారు. కొద్దిమంది మాత్రమే.. కాంగ్రెస్ లో  కొనసాగుతున్నారు. తెరాసలో చేరి కీలక పదవుల్లో ఉన్న నేతలు ఆ పార్టీ వదిలి షర్మిలకు అండగా నిలుస్తారా ? లేదా అనేది మరికొద్ది రోజులు పోతే గానీ తేలదు.  ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ నాయకత్వ లోపంతో సతమవుతున్నది. ఆ పార్టీ నేతలు కొంతమంది షర్మిల కు మద్దతు పలికే అవకాశాలున్నాయి. ఏదైనా కొద్దీ రోజులు గడిస్తే కానీ పార్టీ ఏర్పాటు … సిద్ధాంతాలు … లక్ష్యాలపై ఒక క్లారిటీ రాదు. కాగా కాంగ్రెస్ నేత కేవీపీ అండతో కేసీఆర్ ను రక్షించేందుకు షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే తెరాస నేతలు కూడా షర్మిలపై విమర్శలు చేయడం మొదలెట్టారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!