‘Coast Charm of Tamil Nadu’ IRCTC tour package ……………………
‘కోస్ట్ చార్మ్ ఆఫ్ తమిళనాడు’ పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ లో పుదుచ్చేరిలోని ఆరోవిల్” అరోబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్, చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం, పిచావరం మడ అడవులతో పాటు మహాబలిపురంలోని స్థానిక పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.
ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగుతుంది. కాచిగూడలో ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకు రైలు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 25 వరకు ప్రయాణానికి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
గద్వాల్, జడ్చర్ల, కర్నూలు, మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ల నుంచి కూడా ఈ రైలు ఎక్కవచ్చు. అయితే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టూర్ ముగిశాక మళ్లీ ఆయా స్టేషన్లలో దిగే అవకాశం కూడా ఉంది.
ప్రయాణం ఇలా సాగుతుంది
డే 1… కాచిగూడలో గురువారం సాయంత్రం 5 గంటలకు రైలు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
డే 2.. ఉదయం 11.05 గంటలకు పుదుచ్చేరి స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్ కు వెళతారు. ఆ రోజు అరోవిల్, ఆరోబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్ ని చూస్తారు.ఆ రాత్రి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
డే 3… ఉదయం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి.. అక్కడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం, పిచావరం మడ అడవులను చూస్తారు. తర్వాత పుదుచ్చేరికి తిరిగి వస్తారు.. అక్కడ కాసేపు షాపింగ్ చేసుకోవచ్చు.. ఆ రాత్రికి మళ్లీ పుదుచ్చేరిలోనే బస .
డే 4… హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాక మహాబలిపురానికి బయలుదేరి వెళతారు . అక్కడ పాండవ రథాలు, సముద్రతీరంలోని ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత చెంగల్పట్టుకు వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి కాచిగూడకు బయలుదేరతారు.
డే 5… ఉదయం 7.50 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీలో ఈ సదుపాయాలు ఉంటాయి
ప్యాకేజీని బట్టి రైళ్లో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం…ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.పుదుచ్చేరిలో 2 రాత్రులు ఉండడానికి హోటల్ వసతి, ఉదయం అల్పాహారం ఉచితం..యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం..మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.
పర్యాటక ప్రదేశంలో ప్రవేశ రుసుములు ఉంటే యాత్రీకులు చెల్లించాలి.బోటింగ్, హార్స్ రైడింగ్ వంటివి ప్యాకేజీలో ఉండవు.గైడ్ ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.
ఇతర వివరాలు,బుకింగ్ కోసం IRCTC వెబ్సైట్ చూడండి..