ఆ గోల్డ్ ఇడ్లీ ..గోల్డ్ బిర్యానీ అంత ఖరీదా ?

Sharing is Caring...

New Trend Food………….

సాధారణం గా ఉదయం పూట తినే అల్పాహారంలో ఇడ్లీ, దోస,పూరీ, వడ ఉంటాయి. ఇళ్లల్లో అయితే ఎక్కువగా ఉప్మా చేసుకుని తింటారు. అదే హోటల్స్ కి వెళ్ళినపుడు  మిగతా పదార్ధాలను కోరి మరీ తింటారు. ఇపుడు ఫుడ్ కల్చర్ లో కొత్త ట్రెండ్స్ వచ్చేసాయి.చాలామంది బయట కెళ్ళినపుడు వెరైటీ ఫుడ్ తింటున్నారు.

ఇపుడు నగరాల్లో గోల్డ్ ఇడ్లీ బాగా పాపులర్ అయింది. ఇవి లగ్జరీ వెర్షన్ ఇడ్లీ! సాధారణ ఇడ్లీకి ఎడిబుల్ 24 క్యారెట్ గోల్డ్ లీఫ్ (బంగారు వర్క్) పైన పెట్టి సర్వ్ చేస్తారు. ఈ ఇడ్లీ ని టేస్ట్ కంటే ఎక్కువగా లుక్ & లగ్జరీ కోసం ఆర్డర్ చేస్తుంటారు.

ఆ పల్చటి బంగారం రేకును కూడా తినవచ్చట. ఇది సేఫ్ & గ్లూటెన్-ఫ్రీ అని అంటారు. ఈ గోల్డ్ ఇడ్లీ బంజారా హిల్స్, కింగ్ కోటి, శ్రీనగర్ కాలనీ లలో కొన్ని హోటల్స్ లో లభ్యమవుతున్నాయి. ప్లేట్ (సాధారణంగా 2 పీసెస్) ధర రూ. 1200 వరకు ఉంటుంది. గతంలో  ₹280 నుంచి ₹750 వరకు ఉండేది. ఇటీవలి కాలంలో ధర పెరిగింది. 

ఈ గోల్డ్ ఇడ్లీ ని రోజ్ పెటల్స్, సఫారన్, డ్రై ఫ్రూట్స్,స్పెషల్ చట్నీలతో కలిపి సర్వ్ చేస్తారు. అలాగే గోల్డ్ దోస, గోల్డ్ బిర్యానీ వంటివి కూడా ఉన్నాయి. ధర తక్కువ ఇడ్లీ (₹30-50)తో పోలిస్తే వాటి ధరలు షాకింగ్‌గా అనిపిస్తాయి. గోల్డ్ ఇడ్లీకి ఆదరణ ఇప్పటికీ బాగుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో. 2023 నుంచి ఈ ఇడ్లీ అందుబాటులో ఉన్నాయి.

టేస్ట్ విషయానికొస్తే  సాధారణ ఇడ్లీ రుచి తో పోలిస్తే పెద్ద తేడా లేదని, “ఆ ధరకు వర్త్ కాదు” అని కొందరు అంటున్నారు. కానీ “లగ్జరీ ఎక్స్‌పీరియన్స్” కోసం రిచ్ పీపుల్ , టూరిస్టులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆయా హోటల్స్ కు వెళుతున్నారు.

ఇక గోల్డ్ బిర్యానీ కూడా హైదరాబాద్ లగ్జరీ ఫుడ్ ట్రెండ్‌లో భాగమే. గోల్డ్ ఇడ్లీ లాగానే, సాధారణ బిర్యానీని ఎడిబుల్ 23k లేదా 24k గోల్డ్ లీఫ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తారు. సిల్వర్ బిర్యానీ కూడా అందుబాటులో ఉంది. వీటి ధర సుమారు ₹2500 (ఒక ప్లేట్). ఏజ్డ్ బాస్మతి రైస్, సఫారన్, స్లో-కుక్డ్ మీట్‌తో రాయల్ ఫీల్ ఇస్తారు.

2025లో “హైదరాబాద్ కాస్ట్లీయెస్ట్ డిషెస్”లో ఇది టాప్‌ప్లేస్లో ఉంది.ప్రత్యేక సందర్భాలలో రిచ్ కస్టమర్స్ ఈ న్యూ ట్రెండ్ ఫుడ్ కోసం ఆర్డర్ చేస్తుంటారు. లేదా హోటల్స్ కి వెళ్లి తింటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫుడ్ కి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!