వేమన .. తెలుగు వారికి కొత్తకాదు. అత్యంత సరళమైన తెలుగు భాషతో .. ప్రతి ఒక్కరికీ జీవితంలో అనుభవమయ్యే అంశాలను .. తనదైన శైలితో పద్యాలను అనువుగా చెప్పి ,ధర్మాన్ని చాటి చెప్పిన మహా యోగి వేమన. తన పద్యాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు వేమన. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు.
సమాజంలోని అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపించాడు.
ఇంతటి గొప్ప మహా కవి పేరును స్మార్థకం చేస్తూ.. ఓ యూట్యూబ్ ఛానెల్ వచ్చింది. వేమన భక్తి ఛానెల్ (VBC) అనే పేరుతో ఓ జర్నలిస్ట్ ఈ ఛానెల్ ను రన్ చేస్తున్నారు. ఛానెల్ లో వేమన పద్యాలు అప్ లోడ్ చేస్తున్నారు. వేమన శతకం, తాత్పర్యాలను గొప్ప రచయితలచే వాయిస్ రూపంలో అందిస్తున్నారు.
భారతదేశ ఆధ్యాత్మికత గొప్పతనం, అలాగే మనదేశ ధర్మ ప్రచారాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో యూట్యూబ్ ఫ్లాట్ ఫామ్ గా “వేమన భక్తి ఛానెల్” ప్రారంభించామని నిర్వాహకులు అంటున్నారు. ఇందులో సాధువులు, ప్రమఖ రచయితలు, కవుల ప్రసంగాలు అప్ లోడ్ అవుతున్నాయని.. అలాగే భావంతో కూడిన యోగి వేమన పద్యాలు. రామకృష్ణ పరమహంస , శారదాదేవీ, స్వామి వివేకానంద సూక్తులు, భగవద్గీత పారాయణం, భాగవతం, పండుగల విశిష్టతలు, భజన పాటలు అప్ లోడ్ అవుతున్నాయి .
ఔత్సాహికులు తమ భజన పాటలు, దేశభక్తి పాటలు, ప్రసంగాలు, ప్రవచనాలు వీడియో రూపంలో పంపితే ఛానెల్ లో అప్ లోడ్ చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ తరహా సాహిత్యంపై ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Contact :9246575615
Email: bhavanisokam@gmail.com