టీవీ యాంకర్ గా ట్రాన్స్ జెండర్ !

Sharing is Caring...

సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇంకా వివక్షతను ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో కొంత మేరకు మార్పులొచ్చాయి.ఇపుడిపుడే వారు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన తష్ణువా అనన్ శిశిర్ కూడా ఆ కోవలోమనిషే. 29 ఏళ్ల తష్ణువా అనన్ శిశిర్  గతంలో ఒక ఎన్జీవోలో మానవహక్కుల కార్యకర్తగా పని చేసింది. మొన్నటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక ప్రయివేట్ టెలివిజన్ ఛానల్ లో న్యూస్ యాంకర్ ఉద్యోగంలో చేరింది. చేరిన రోజే న్యూస్ బులిటెన్ చదివి తాను ఎవరికి తీసిపోనని నిరూపించుకుంది. తష్ణువా యే బంగ్లాదేశ్ మొదటి న్యూస్ యాంకర్ కావడం విశేషం. తనను చూసి చాలామంది ధైర్యంతో ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకొస్తారని తష్ణువా అంటోంది.

బంగ్లాదేశ్ లో ప్రభుత్వ అంచనాల మేరకు 11500 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. అయితే ఎన్జీవోలు మాత్రం ఇంకా ఎక్కువే  ఉండొచ్చని అంటున్నారు. వీరంటే సమాజంలో ఒక చిన్న చూపు. చాలామంది తరచుగా వివక్షతను ఎదుర్కొంటున్నారు. దీంతో కొంచెం చదువుకున్నవారు కూడా సమాజంలోకి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తష్ణువా  తెర పై న్యూస్ యాంకర్ గా మెరవడం ఆ కమ్యూనిటీ కి గర్వకారణం. తనను కూడా  బయటివాళ్లు .. ఇంట్లో వాళ్ళు మాటలతో వేధించేవాళ్ళని .. ఒక దశలో ఆత్మహత్య యత్నం కూడా చేశానని తష్ణువా చెబుతోంది. తన తండ్రి తనతో మాట్లాడటం మానేశాడని తన వల్ల కుటుంబం ఇబ్బంది పడకూడదని ఇల్లు వదిలి డాకా చేరి సొంతంగా బతుకుతున్నా అంటోంది శిశిర్. హార్మోన్ థెరపీ తీసుకుంటూ .. మరోవైపు స్థానిక నాటక సంస్థలతో కలసి నాటకాలు వేయడం .. తర్వాత ఎన్జీవో లో చేరి హక్కుల కార్యకర్తగా చేస్తూ ట్రాన్స్ జెండర్ల కు, వలసవాదులకు మద్దతుగా పనిచేస్తున్నది.

ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ పై  ప్రజల ఆలోచనా ధోరణి మారేందుకు కృషి చేస్తున్నానని..   మెల్ల మెల్లగా సమాజంలో మార్పు వస్తుందని .. తమకు గౌరవం దక్కుతుందని శిశిర్ అంటున్నారు. చాలామంది ట్రాన్స్ జెండర్లు  చిన్నతనం లోనే కుటుంబాల నుంచి వెలివేతకు గురైనవారే . సరైన విద్య లేకపోవడం .. వివక్ష కారణంగా పేదరికంలో ఉండిపోతున్నారు. 
ఇండియాలో కూడా ఇటీవల కాలంలో చాలామంది ట్రాన్స్ జెండర్లు బయటకొస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి తమ సత్తా చాటుకుంటున్నారు. 

————–KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!