తిరుమల వెళ్లాలనుకుంటున్నారా ?ఈ ప్యాకేజి మీకోసమే !!

Sharing is Caring...

IRCTC GOVINDAM TOUR PACKAGE …………….

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే IRCTC టూర్ ప్రోగ్రాం పై ఓ కన్నేయండి. హైదరాబాద్ నుంచి తిరుపతి కి  డైలీ టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు గోవిందం టూర్. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ 4వేల లోపే.

ఎవరైనా తక్కువ సమయంలో.. అప్పటికప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ గోవిందం టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి వెళ్లే భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. 

ఈ టూర్ ప్యాకేజీ లో మొదటి రోజు భక్తులు 12734 నెంబర్ ట్రైన్ ఎక్కాలి. సాయంత్రం 5.30 గంటలకు లింగంపల్లిలో ఈ రైలు స్టార్ట్ అవుతుంది. 6.10 గంటలకు సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా రైలు ప్రయాణం సాగుతుంది.రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

ఇక్కడ హోటల్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ముగించుకుని ప్రత్యేక వాహనం లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలు దేరుతారు.అక్కడ కేటాయించిన టైం ని బట్టి  శ్రీవారిని స్పెషల్ దర్శనం చేసుకుంటారు. అనంతరం సొంత ఖర్చుపై భోజనం చేస్తారు.

సాయంకాలానికి రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ఉన్న ట్రైన్ ఎక్కుతారు.మరుసటి రోజు తెల్లవారు జామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 7 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రైలు లింగపల్లికి వెళుతుంది. దీంతో గోవిందం టూర్ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు రెండు రకాలుగా ఉన్నాయి. ఐఆర్ సీటీసీ. స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు
స్టాండర్డ్ ప్యాకేజీని ఎంచుకున్నవారు స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కంఫర్ట్ ప్యాకేజీలో భాగంగా థర్డ్ ఏసీ రైలు ప్రయాణం చేయాలి.

 

ప్యాకేజీలో ప్రయాణీకులకు అందించే సౌకర్యాలుతిరుమల రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఏపీ వాహనంలో రవాణా, హెూటల్లో బసతో పాటు.. రైల్వే శాఖ వెంకన్న దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని ఏర్పాటు చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. దీని ప్రత్యేకత అదే. తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకువెళ్లాలి ..దర్శనానికి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి ఇతర వివరాలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ని చూడండి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!