Old but great man …………………..
ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు సవాంగ్ జన్‌ప్రామ్. వయసు 102 ఏళ్లు. అయినా శారీరకంగా ధృడమైన వ్యక్తి. థాయ్‌లాండ్‌కు చెందిన సవాంగ్ జనప్రామ్ ఆ వయసులో కూడా 100 మీటర్ల పరుగును కేవలం 27.08 సెకన్లలో ముగించి సరికొత్త రికార్డు సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
వారం క్రితం థాయ్‌లాండ్ సాముత్ సాంగ్‌ఖ్రమ్ ప్రావిన్స్‌లో మాస్టర్స్ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. అందులో 100-105 ఏళ్ల కేటగిరీలో జరిగిన పోటీల్లో ఈ సవాంగ్ మొత్తం మెడల్స్ గెలుచుకున్నాడు. అది కూడా ఒక రికార్డే. ఈ పెద్దాయన స్వతహాగా ఒక అథ్లెట్.అందుకే ఈవయసులోనూ హుషారుగా పోటీల్లో పాల్గొని తన సత్తా చాటుకుంటుంటాడు.
ఈసారి పోటీల్లో సవాంగ్ తన ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోటీపడి వంద మీటర్ల పరుగును 27.08 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ పేరిట ఉంది. (2009లో 9.58 సెకండ్లు). అయితే ఈ ఏజ్‌లో సవాంగ్ ఈ రికార్డును నెలకొల్పడం గొప్ప విషయమే.
అన్నట్టు సవాంగ్ కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలామంది అమ్మాయిలు గై డెన్స్ కోసం సవాంగ్ ను సంప్రదిస్తుంటారు. డెభ్భై ఏళ్ల కూతురు సిరిపాన్ సవాంగ్ కి ట్రయినర్‌గా వ్యవహరిస్తోంది.ఆమె కు కూడా క్రీడా చరిత్ర ఉంది.
ఇక సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ “ఆటలే నన్ను బలంగా ఉంచుతున్నాయి. వేళకు పుష్టికరమైన ఆహరం తిని,ఫిట్నెస్ పెంచుకునే వ్యాయామం చేస్తే మీరూ ఆరోగ్యంగా ఉండొచ్చు” అంటున్నాడు. కాగా థాయ్‌లాండ్ లో మాస్టర్ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు 1996 నుంచి జరుగుతున్నాయి.
గతంలో కేవలం 300-400 మందిమాత్రమే పాల్గొన్నారు. ఇపుడు హెల్త్ అవెర్నెస్ పెరగడంతో 2 వేల మంది వరకు పాల్గొంటున్నారు. 35 నుంచి 102 ఏళ్ల మధ్యవయస్కులు ఉత్సాహంగా పోటీలకు వస్తున్నారు. వయసు అయిపోయిందని కుమిలిపోతూ మూలకూర్చోకుండా తన వయసు వారికి .. యువతకు ఇలాంటి పెద్దవాళ్ళే స్ఫూర్తి దాతలు.