ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ మిస్టరీయే !!

Sharing is Caring...

Unsolved Cases…………………………….

రెండేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా ది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ రెండు హత్యల పై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని చాలామంది ఆశపడ్డారు.

అమెరికా అత్యున్నత గూఢచార సంస్థ సీఐఏ ఈ రెండు హత్యల వెనక ఉన్నదనే అనుమానాలు ఇంతకాలంగా ఉన్నాయి.ఈ ఇరువురు ప్రముఖుల మరణాలు జరిగినప్పుడు సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించిన రాబర్ట్ క్రౌలీ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారని అమెరికా రచయిత గ్రెగొరీ డగ్లస్ కూడా తన ‘కన్వర్జేషన్ విత్ ది క్రై’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

రాబర్ట్ తో సంభాషణల రికార్డులను ప్రస్తావిస్తూ.. శాస్త్రి, బాబాలది సీఐఏ చేసిన హత్య అని అయన వివరించారు. ఈ విషయాలు వెలుగు చూడటంతో శాస్త్రి మనవరాలు మందిర, మనవడు విభాకర్ శాస్త్రి లాల్ బహదూర్ మరణంపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలని ప్రధాని మోడీ ని 2022 లో కోరారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ క్రమంలో విచారణ పై నెలకొన్న ఆశలు అడుగంటాయి.

భారత్ అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో శాస్త్రి, బాబా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయం అది. అప్పట్లో రష్యాతో భారత్ సన్నిహితంగా ఉండేది. భారత్ తో ఎప్పటికైనా ముప్పు అని భావించి అమెరికా ఈ కుట్రకు పాల్పడింది. సీఐఏ ఆ పని పూర్తి చేసింది. ఈ హత్యలు జరిగినపుడు ఇది సీఐఏ పని అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

అప్పట్లో భారత్ ప్రభుత్వం సరైన విచారణ చేపట్టలేదు. తొమ్మిదేళ్ల తర్వాత శాస్త్రి అనుమానాస్పద మరణంపై 1977 లో జనతా సర్కార్ రాజ్‌ నారాయణ్‌ కమిటీ ని నియమించింది. ఈ కేసులో ఇద్దరు కీలక సాక్షులున్నారు. ఆర్‌ఎన్ చుగ్ శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు, వ్యక్తిగత సేవకుడు రామ్ నాథ్. ఈ ఇద్దరూ కమిటీ విచారణకు వస్తుండగా రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.

ఆ ఇద్దరూ ఎలా మరణించారో అనేది కూడా సస్పెన్స్. దీంతో కమిటీ ఏమి తేల్చలేదు. కమిటీ ఏమి అభిప్రాయపడింది ?దాని తాలూకు రిపోర్టులు, పోస్టుమార్టం తదితర రికార్డులు కూడా గల్లంతు అయ్యాయి. ఈ కేసుల గురించి ఏ ప్రభుత్వాలు కూడా సరైన విచారణ జరపలేదు. శాస్త్రి మరణం వెనుక అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

2009లో దక్షిణాసియాపై సిఐఎ దృష్టి పేరిట పుస్తకం రాయడానికి అనుజ్‌ధార్‌ అనే రచయిత ప్రయత్నించారు. ఇందుకోసం శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటి జారీకి పిఎమ్‌ఓ నిరాకరించింది. ఈ పత్రాల జారీ భారత సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అనుజ్‌ధార్ కిచ్చిన లేఖలో పిఎమ్‌ఓ అధికారులు చెప్పడం విశేషం.

ఎందరో ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ప్రభుత్వాలు స్పందించలేదు. శాస్త్రి మనవడు, మనవరాలు కోరినట్టు సర్కార్ కమిటీ వేయ బోదని అప్పుడే అనుకున్నారు. అలాగే జరిగింది. రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!