First Sun Rise Place ………………….
ఇండియాలోని మిగతా ప్రాంతాల కంటే ముందుగా డాంగ్ గ్రామంలో సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సూర్యుడు కనిపిస్తాడు. డాంగ్ గ్రామాన్ని ‘ఉదయించే సూర్యుని భూమి’ అని కూడా పిలుస్తారు. డాంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా డాంగ్ వ్యాలీలో ఉంది.
ఈ అద్భుతాన్ని చూసేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి వస్తుంటారు. చుట్టూ కొండలు,పచ్చని ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. డాంగ్ గ్రామం లోహిత్ నది ఎడమ ఒడ్డున ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన పైన్ అడవులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
డిసెంబర్ 31 రాత్రికి ఇక్కడకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. జనవరి 1 వ తేదీ అక్కడ సూర్యుడిని తిలకించాలని ఆరాటపడుతుంటారు. చైనా.. మయన్మార్ దేశాల మధ్య ఉన్న డాంగ్ గ్రామం సముద్ర మట్టానికి దాదాపు 1,240 మీటర్ల ఎత్తులో ఉంది.డాంగ్ గ్రామంలో పగలు, రాత్రి చక్రం ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఇక్కడ చీకటి పడుతుంది.
డాంగ్ గ్రామం పరిసరాల్లో సందర్శించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.. లోహిత్ నది పశ్చిమ ఒడ్డున సహజ వేడి నీటి బుగ్గలు, దగ్గరలో బోర్డర్ విలేజ్ కిబుతూ గ్రామం ఉన్నాయి. కిబుతూ ఊరి పొలిమేర నుంచి చూస్తే చైనా, మయన్మార్ దేశాలు కనిపిస్తాయి.
ఈ గ్రామంలోప్రధానంగా మెయోర్ తెగవారు నివసిస్తున్నారు.దాదాపు 50 మంది జనాభా ఉన్న డాంగ్ గ్రామంలో కేవలం తొమ్మిది మెయోర్ కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. భారత దేశంలోని తూర్పున ఉన్న గ్రామాలుగా పిలువబడే కహో, కిబితు గ్రామాల నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఈ డాంగ్ గ్రామం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ తూర్పున .. గుజరాత్ పశ్చిమాన ఉంది. భూమి పశ్చిమం నుండి తూర్పుకు కదులుతుంది, కాబట్టి తూర్పు భాగాలలో సూర్యోదయం ముందుగా అవుతుందని అంటారు.
డాంగ్ విలేజ్ చేరుకోవడం ఎలా ?
డాంగ్, వాలోంగ్, కిబితూ అనే మూడు గ్రామాలు మారుమూలగా ఉన్నాయి. అక్కడికి చేరుకోవాలంటే కొంచెం కష్టపడాలి. రోడ్లు, హోటళ్ళు, విద్యుత్, నీరు వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లలేకపోతున్నారు.
దిబ్రుగఢ్‌లో విమానాశ్రయం నుంచి డాంగ్ విలేజ్ 400 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుండి బస్సు లేదా టాక్సీలో తేజుకు చేరుకోవాలి.తరువాత డాంగ్‌కు వెళ్ళాలి.డాంగ్ గ్రామానికి సమీప రైల్వే స్టేషన్ టిన్సుకియా స్టేషన్ , ఇది దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడనుంచి తేజు కు టాక్సీ లేదా బస్సులో వెళ్ళాలి. అక్కడి నుండి డాంగ్‌కు వెళ్ళాలిప్రయాణం కొంచెం కష్టమైనా అద్భుతమైన అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.