అప్పట్లో దండియాత్ర ఓ సంచలనం !!

Sharing is Caring...

Vasireddy Venugopal ………………………………………..  
దండి యాత్రకు 91 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం…..  
ఉప్పుపై  పన్ను ఈనాటిది కాదు    మనుగడకు ఉప్పు 
తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!!
…..
బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. భారతదేశంలో మౌర్యుల కాలంనాటికి ఉప్పు పన్ను వుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రం ద్వారా ఆ విషయం తెలుసుకోవచ్చు. తెలుగు నేలపై ఉప్పు పన్నుకి సంబంధించి తొలి నమోదిత ఆధారం క్రీస్తుశకం 1249వ సంవత్సరం నాటిది కనిపిస్తోంది. మార్కాపురంలోని ఒక ఆలయంకోసం గణపతిరాజు ఉప్పు సుంకం విధించాడు.
సాధారణంగా రాజులు, సామంతరాజులు ఆలయాలు కట్టించడం, వాటిలో ధూపదీప నైవేద్యాల నిమిత్తం మణులు, మాన్యాలు దానం చేయడం ఆనవాయితీ.కానీ, దానికి విరుద్ధంగా… మార్కాపురం ఆలయం ఆలనాపాలనాకోసం ప్రజలపై ఉప్పు పన్ను విధించడం చాలా ఆశ్చర్యంగా వుంది. తెలుగునేలపై ఉప్పు పన్నుకి సంబంధించిన తొలి ఆధారం ఇది.భారతదేశంలో Salt Tax కి సంబంధించి గూగులయ్యని అడిగితే.. మౌర్యుల కాలంలో వుందని చెబుతోంది. ఆ తర్వాత 1930లో మహాత్మాగాంధి చేపట్టిన దండియాత్ర  ప్రస్తావన కనిపిస్తుంది. 
బ్రిటిష్ సర్కార్ ఉప్పు పై పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఉప్పు సత్యాగ్రహం చేపట్టాలని గాంధీ అప్పట్లో పిలుపునిచ్చారు. 78 మంది అనుచరులతో 240 మైళ్ళ దూరం నడచి 1930 ఏప్రిల్ 6 న దండి ప్రాంతం చేరుకున్నారు.ఏప్రిల్ ఆరోతేదీ ఉదయం 6. 30 గంటలకు గాంధీ దండిలో పిడికెడు ఉప్పును పట్టుకుని బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలిస్తున్నట్టు ప్రకటించారు.. అప్పటికే ఆయన పాదయాత్ర గురించి ప్రపంచానికి తెలియడంతో ఎంతో మంది పాత్రికేయులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు అర లక్షమంది జనం అక్కడికి చేరుకున్నారు.

రఘుపతి రాఘవ రాజారామ్ భజనతో ఆ ప్రాంతం అంతా మారు మ్రోగిపోయింది. అక్కడనుంచి పాదయాత్ర మొదలైంది. తీరం వెంబడి గ్రామాల్లో నుంచి పాదయాత్ర సాగింది. గాంధీ ప్రతి గ్రామంలో ఆగుతూ స్వాతంత్ర ఉద్యమం ప్రాధాన్యత గురించి వివరించారు. గ్రామ ప్రాంత ప్రజలు గాంధీని అనుసరించారు. మే 4 వ తేదీ అర్ధరాత్రి మామిడి తోటలో నిద్రిస్తున్న గాంధీని అరెస్ట్ చేసి బ్రిటిష్ పోలీసులు పూణే జైలుకి పంపారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఉప్పు సత్యాగ్రహాలు జరిగాయి. 60 వేలమందికి పైగా అరెస్ట్ అయ్యారు. 
అ,ది అరేబియా సముద్ర తీర ప్రాంతం. ఆ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించారని గాంధీని అరెస్ట్ చేశారు. ఈ ఉద్యమం లో భాగంగా మద్యపాన శాలలు, వస్త్రదుకాణాల ముందుధర్నాలు ,నిరసన కార్యక్రమాలు జరిగాయి. దండి యాత్ర గురించి తెలిసాక ప్రకాశం పంతులు కూడా తెల్లదొరలపై విరుచుకుపడ్డాడు. ఏ నాయకుడూ సాహసించని రీతిలో అసెంబ్లీ లో గళమెత్తారు. అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసారు. గాంధీ చేపట్టిన ఈ ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్య్ర సమరానికి  పునాదిలా నిలిచింది. దక్షిణ భారతంలో ఆ ఉద్యమాన్ని ప్రకాశం పంతులు కొత్త పుంతలు తొక్కించారు.

అస్సాం లోని సిల్హేట్, బెంగాల్ లోని నౌఖలి, మద్రాస్ రాష్ట్రం,ఆంధ్ర ,కేరళలోని కాలికట్ , యూపీ లోని అలహాబాద్ ,ఇప్పటి పాకిస్థాన్ లోని పెషావర్ , తదితర ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం వివిధ రూపాల్లో జరిగింది. గహర్వాల్ లో ప్రజలపై కాల్పులు జరపడానికి సైనికులు నిరాకరించారు. మహారాష్ట్ర లోని షోలాపూర్ లో వస్త్ర కార్మికులు సమ్మెకు దిగారు. 1946 లో తాత్కాలిక భారత్ ప్రభుత్వం ఈ ఉప్పు పై పన్నును రద్దు చేసింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!