బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సాధనం !

Sharing is Caring...

Best option…………………………………………………………. 

పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్ట భయం ఉండ కూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు…. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

అలాగే రాబడి, మెచ్యూరిటీ మొత్తం పై పన్ను వర్తించదు. భార్యా భర్తలు కూడా విడివిడిగా పీపీఎఫ్ ఖాతాలు తెరవవచ్చు.అలాగే పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాలను తెరవవచ్చు.మామూలుగా ఒక వ్యక్తి పేరుపై ఒక పీపీఎఫ్ ఖాతాను మాత్రమే తెరిచే వీలుంది. ఒకవేళ పొరపాటున ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచినా రెండో ఖాతాను నిరుపయోగ ఖాతాగా పరిగణిస్తారు.

ఆ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ లభించదు. పీపీఎఫ్ ఖాతాలో ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే పెట్టుబడులపై సెక్షన్ 80c కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.భార్యాభర్తలిద్దరూ సంపాదనపరులైతే ఎవరి పేరుపై వారు సొంత ఖాతాలను తెరవొచ్చు. అలాగే, పీపీఎఫ్ కింద లభించే ప్రయోజనాలను విడివిడిగా పొందొచ్చు.

ఒకవేళ భార్య ఉద్యోగం చేయకపోతే.. అప్పుడు భార్యకు బదులు భర్త పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పెట్టుబడులు భర్త ఆదాయం నుంచి చేస్తున్నారు కాబట్టి వడ్డీని భర్త ఆదాయానికి జోడిస్తారు. ఇలాంటి సందర్భాల్లో భార్యాభర్తలిద్దరి ఖాతాలో రూ. 1.50 లక్షల చొప్పున రూ. 3 లక్షల వరకు జమ చేసినా.. సెక్షన్ 80 సి కింద రూ. 1.50 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అయితే రాబడి, మెచ్యూరిటీలపై పన్ను ఉండదు కాబట్టి భర్త ఆదాయానికి జోడించినా ఇబ్బంది ఉండదు.

ఇక పిల్లల పేరుపై తల్లి లేదా తండ్రి పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. తల్లిదండ్రులు జీవించి ఉండగా.. వేరొకరు పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతాను తెరిచే అనుమతిలేదు. తల్లిదండ్రులిద్దరూ లేకపోతే, చట్టబద్దమైన గార్డియన్ కి మాత్రమే పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతాను తెరిచే అనుమతి ఉంటుంది.ఒకే మైనర్ పేరుపై తల్లిదండ్రులిద్దరూ ఖాతాలను తెరవకూడదు.

ఒక మైనరు పేరుపై తల్లి లేదా తండ్రి ఒక్కరు మాత్రమే ఖాతాను తెరిచే వీలుంది. అయితే కాంట్రీబ్యూషన్ మాత్రం ఇద్దరూ చేయవచ్చు.ఒక వ్యక్తి తన పేరుతో తన పాప/బాబు పేరుతో ఖాతాను తెరిచి రెండు ఖాతాలకు కాంట్రీబ్యూట్ చేస్తున్నట్లయితే.. ఒక ఏడాదిలో రెండు ఖాతాల్లో చేసే మొత్తం పెట్టుబడులు రూ. 1.50 లక్షలకు మించకూడదు.

ఒకవేళ పీపీఎఫ్ ఖాతా ఉన్న పిల్లవాడు మేజర్ అయితే, ఖాతాను మేజర్ అయిన పిల్లవాడి పేరుకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ ఖాతాను వ్యక్తిగత ఖాతాగా మారుస్తారు. సాధారణ ఖాతాకు లభించే అన్ని ప్రయోజనాలు ఈ ఖాతాకు వర్తిస్తాయి. మేజర్ అయిన పిల్లవాడి ఖాతాకు అతని తరఫున తల్లిదండ్రులు కాంట్రీబ్యూట్ చేయవచ్చు. అయితే, ముందే చెప్పినట్లు పెట్టుబడులను పెట్టుబడిదారుని ఆదాయానికి చేర్చుతారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!