Bharadwaja Rangavajhala …………………
కీరవాణి అనే పేరు గల సంగీత దర్శకుడి గురించి కొన్ని గోరు చుట్లు (థంబ్ నెయిల్స్ ) చూసాక ఇది రాయాలి అనిపించింది…నా ఫ్రెండ్ ఓ సినిమా తీస్తున్నాడు… అతను తనే కథ రాసుకుని…నాలాంటి కొందరు ఫ్రెండ్స్ ని పాత్రలకు ఎంపిక చేసుకుని… షూటింగ్ జరుపుతూ ఉన్నాడు.
బహుశా ఇంకొన్ని రోజుల్లో కంప్లిట్ అవ్వొచ్చు కూడా…అయితే ఇక్కడ విషయం ఏమిటంటే…ఆ సినిమా లో ఓ సన్నివేశం కోసం ఓ పాట అవసరం అయ్యింది..ఎవరు పాడితే బావుంటుంది అని ఓ చర్చ జరిగింది మా మధ్య…కీరవాణి అయితే బాగా వస్తుంది అన్నాన్నేను…ఎలా చెప్పగలవు అన్నాడు నా ఫ్రెండ్.
ఘంటసాల పాడిన జాషువా పాపాయి పద్యాలు ఆ మధ్య ‘పాడుతా తీయగా’ లో కీరవాణి పాడారు…అది విని చెప్తున్నా… మీరు అనుకుంటున్న ఫీల్ క్యారీ కావాలి అంటే ఆయనే రైట్ అన్నాను…ఆ దర్శకులు కూడా సరే అని…అయితే ఆయన్ని అప్రోచ్ అవడం ఎలా అని అడిగాడు.
చూద్దాం మా పాత టీవీ ఫైవ్ ఆఫీస్ దాటి వెళితే ఆయన ఇల్లు.. ఆ రోజుల్లో రెండు మూడు సార్లు ఆయన బయట నిలబడి ఉండగా చూసాను అని చెప్పాను..సరే నేనూ వస్తాను రేపు పొద్దున్న ఓ సారి కలుద్దాం అన్నాడు మా మిత్రుడు. మర్నాడు వెళ్ళాం.. ముందుగా చెప్పకండా అంత పెద్ద ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కదా ఖోప్పడతాడేమో అనుకుంటూ కింద గేటు తీసా…తియ్యగానే ఒక పనిమనిషి వచ్చి ఎవరు కావాలండి అని అడిగింది.
కీరవాణి గారు అన్నా..ఒక్క నిమిషం అని ఫస్ట్ ఫ్లోర్ లోకి పోయి అక్కడ ఎవ్వరికో రిపోర్ట్ చేసింది..ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు..కీరవాణి గారి అబ్బాయినండి.. రండీ పైకి అని పైకి తీసుకెళ్లాడు…చెప్పండి ఏం పని మీద వచ్చారు అన్నాడు చాలా వినయం గా…ఆయనతో ఓ పాట పాడిద్దాం అనీ అనేసా నేను ఘబుక్కున.
నాన్న రాత్రి ఏదో సినిమా ఆర్ ఆర్ చేయడానికి వెళ్లి ఇందాకే వచ్చి పడుకున్నారు..మీరు మీరు వచ్చిన పని.. మీ నంబరు రాసి ఇవ్వండి..అనీ ఓ పేపరు ప్యాడు పట్టుకొచ్చి ఇచ్చాడు…రాసి ఇచ్చేసాక…నాన్న లేవగానే ఇస్తాను.. ఆయనే ఫోన్ చేస్తారు మీకు అన్నాడు ఆ భైరవ అనే కుర్రాడు.
సరే ఆయన ఇది చదివి ఫోన్ చెయ్యడమా అనుకున్నాను నేను…సాయంత్రం ఐదు గంటలకు ఓ అన్నోన్ నంబర్ నుంచీ ఫోన్…లిఫ్ట్ చేశా… హలో నేను కీరవాణి.. మీరు భరద్వాజేనా అని అడిగారు అట్నుంచి… ఆయన స్టోన్ నేను గుర్తించా.సార్ మా ఫ్రెండ్ సినిమా సార్… మీకు రాసిచ్చిన సిట్యుయేషనల్ సాంగ్ మీతో పాడించుకోవాలి అనుకున్నాం మేము … మీకు అభ్యంతరం లేకపోతే అన్నానేను.
ఓ పని చేయండి సాహిత్యం పంపండి వాట్సాప్ లో నేను చూసి మీకు రేపు ఫోన్ చేస్తాను అన్నాడు ఆయన.రాత్రికి సాహిత్యం వెళ్ళిపోయింది… మళ్ళీ సాయంత్రం ఫోన్…మీరు ఏదైనా ట్యూన్ అనుకున్నారా? లేక నేనే చేసేసి, పాడేసి పంపేయనా?అలాగే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా? లేక నేనే ఆర్కెస్ట్రా చేసి పంపేయనా అన్నారు ఆయన.. అలా అయితే ఇంకా సుఖం కదండీ అంటే సరే అన్నారు ఆయన.
నేను ఎవరో తెలియదు… పరిచయం లేదు.. మేబి యూ ట్యూబ్ లో చూసి ఉంటే…విజయేంద్ర ప్రసాద్ గారిని .. రాజమౌళి ని విమర్శించిన వీడియోలు ఎక్కువ ఉంటాయి… దీనికి మేం ఎంత ఇవ్వాలి అంటే.. అదేం అక్కర్లేదు… నేను మెయిల్ చేస్తాను కదా అన్నారు వారు..మళ్ళీ ఆయన్ని కలవనుకూడా లేదు… ఫోన్ లోనే… అంతా…అలాంటి వ్యక్తి మీద ఇలాంటి గోరు చుట్లు చుడితే బాధ వేయదూ మరీ.