ఈ పాలసీపై ఓ కన్నేయండి !

Sharing is Caring...

New Policy …  LIC Dhan Varsha ………………………………………….

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  మరో కొత్త జీవిత బీమా పాలసీని ప్రకటించింది. ‘ఎల్‌సీ ధన వర్ష (ప్లాన్ 866) పేరిట దీన్ని అందిస్తోంది.  ఈ పాలసీలో బీమాతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఇది క్లోజ్డ్ ఎండెడ్ ప్లాన్. 2023 మార్చి 31తో ప్లాన్ విక్రయాలు ముగుస్తాయి.

ఇది నాన్-లింక్ట్, నాన్-పార్టిసిపేటివ్, ఇండివిజువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం జీవిత బీమా పథకం. మెచ్యూరిటీ బెనిఫిట్ : కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారుడికి పాలసీలో పేర్కొన్న బేసిక్ హామీ మొత్తం (Basic Sum Assured)తో పాటు ఏటా కలిసే ఖచ్చితమైన రాబడి అందుతుంది.

పాలసీ కాలపరిమితి ముగిసే వరకు ప్రతి ఏటా కొంత మొత్తాన్ని మన ప్రీమియానికి కలుపుతూ పోతారు. ఒకవేళ పాలసీని మధ్యలోనే రద్దు చేసుకున్నా.. అప్పటి వరకు లభించిన మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా పాలసీ దారుడికి అందజేస్తారు. ఏటా ఎంత మొత్తం కలుపుతారనేది ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.

డెత్ బెనిఫిట్ : పాలసీదారుడు ఒకవేళ మధ్యలోనే మరణిస్తే కుటుంబ సభ్యులకు పాలసీలో పేర్కొన్న హామీ మొత్తం (Sum Assured on Death)తో పాటు ఏటా కలిపే ఖచ్చితమైన రాబడి లభిస్తుంది.మరణిస్తే లభించే మొత్తం మనం ఎంచుకున్న ఆప్షన్‌పై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 : ప్రీమియానికి 1.25 రెట్లు ఆప్షన్ 2 : ప్రీమియానికి 10 రెట్లు… వయసు, హామీ మొత్తం, కాలపరిమితి పై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. అందుకనుగుణంగా ఏటా కలిపే ఖచ్చితమైన రాబడి కూడా అందుతుంది.

వయసు : 15 ఏళ్ల పాలసీకి కనీస వయసు 3 ఏళ్లు. 10 ఏళ్ల కాలపరిమితి గల పాలసీకి కనీసం 8 ఏళ్లు నిండి ఉండాలి. ఇక రైడర్ల విషయానికొస్తే ఈ పాలసీలపై సంస్థ అందించే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రైడర్‌ను ఎంచుకుంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఇక  పాలసీ తీసుకొని మూడు నెలలు గడిచిన తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. రుణ మొత్తం పాలసీ సరెండర్ విలువ (మధ్యలో రద్దు చేసుకుంటే లభించే మొత్తం)పై ఆధారపడి ఉంటుంది. వడ్డీరేటును ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది .

బేస్ ప్లాన్ వివరాలు.. కనీస హామీ మొత్తం : రూ. 1,25,000 గరిష్ట హామీ మొత్తం : పరిమితి లేదు కనీస వయసు : 3 ఏళ్లు (15 ఏళ్ల పాలసీకి); 8 ఏళ్లు (10 ఏళ్ల పాలసీకి) గరిష్ఠ వయసు : ఆప్షన్ 1- 60 ఏళ్లు; ఆప్షన్ 2- 40 ఏళ్లు (పాలసీ కాలపరిమితి 10 ఏళ్లు), 35 ఏళ్లు (పాలసీ కాలపరిమితి 15 ఏళ్లు) కనీస మెచ్యూరిటీ వయసు : 18 ఏళ్లు గరిష్ఠ మెచ్యూరిటీ వయసు : ఆప్షన్ 1- 75 ఏళ్లు; ఆప్షన్ 2- 50 ఏళ్లు

ఒకవేళ 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఒకేసారి రూ. 8, 86,750 ప్రీమియం (జీఎస్టీ కలిపి రూ. 9,26, 654) చెల్లిస్తే ఆప్షన్ 1 కింద రూ.11,08,438 హామీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాలపరిమితి 15 ఏళ్లు అయితే గడువు ముగిసిన తర్వాత రూ.21,25,000 పొందొచ్చు. ఒకవేళ పాలసీ తీసుకున్న తొలి ఏడాదిలోనే మరణిస్తే రూ.11,83,438 కుటుంబానికి అందజేస్తారు. 15వ ఏడాదిలో మరణిస్తే రూ. 22,33,438 అందుతాయి. అదే ఆప్షన్ 2 కింద రూ.8,34,642 ప్రీమియం చెల్లిస్తే రూ. 10 లక్షల హామీ లభిస్తుంది. ఒకవేళ మరణిస్తే రూ. 79,87,000 అందుతాయి.

ఈ ప్లాన్ ను ఆన్లైన్లో ఏజెంట్ లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ / కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ వంటి ఇతర మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆన్లైన్లో LIC వెబ్ సైట్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే ప్రీమియంపై రిబేట్ కూడా లభిస్తుంది.  ఈ ప్లాన్ కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా సీనియర్ ఏజెంట్ … లేదా  కన్సల్టెంట్ ను తో చర్చించండి.  అన్ని విధాలా సంతృప్తి పడితేనే కొనుగోలు చేయండి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!