కెప్టెన్ పార్టీని నిలబెట్టుకోగలరా ?
తమిళనాట రాజకీయాల్లోకి దిగిన సినిమా నటులు చాలామందే ఉన్నారు . వారిలో హీరో విజయ్‌కాంత్ ఒకరు. 2005 లో విజయ్ కాంత్ దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పేరిట పార్టీని పెట్టారు. నగరా గుర్తుతో నాడు బరిలోకి దిగిన విజయ్ కాంత్ పార్టీ ఒక సీటుకే పరిమితమైంది. వ్రిదాచలం నియోజకవర్గంలో విజయకాంత్ మాత్రమే గెలిచారు. మిగిలిన …