కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!
Bharadwaja Rangavajhala ……………………………………… “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …