గిట్టని వాళ్లంతా అర్బన్ నక్సల్సా ?
అర్బన్ నక్సల్ అనే పదం ఈ మధ్యకాలంలోనే వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి పాలకులు పెట్టిన పేరు అది . తొలిసారి గా ఈ పదం భీమా కోరేగావ్ కేసులో వినబడింది. వరవరరావు ,అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోన్యాల్ తదితరుల అరెస్ట్ తో మావోయిస్టుల అర్బన్ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టునేతలకు పౌరహక్కులనేతలు సహకరిస్తున్నారని ,వీరి ద్వారా విద్యార్థులను మావోయిస్టుల వైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. …