సీన్ కానరీ స్టయిలే వేరు !
Goverdhan Gande…………… అత్యద్భుతమైన విన్యాసాలు,ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, ప్రాణాలు హరిస్తాయేమోననే భయం. మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు… వీటి మధ్య శృంగార దృశ్యాలు. అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా కట్టి పడేసే దృశ్య మాలికల సమాహారం. …
