బతికి ఉండగానే.. మరణించారని ప్రచారం చేసిన మీడియా!
లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్టు కొన్ని మీడియా సంస్థలు గురువారం వార్తలను ప్రచారంలోకి తెచ్చాయి.కానీ “ఆ వార్తలు అసత్యం .. నేను బతికే ఉన్నా”నంటూ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియ జేస్తూ .. అసత్య వార్తలను ఆమె ఖండించారు. ఒక ఆడియో టేప్ ను కూడా ఆమె రిలీజ్ చేశారు. …