హైదరాబాద్ లో బంగ్లా అమ్మాయిల అమ్మకం !
హైదరాబాద్ నగరం అమ్మాయిల అక్రమ రవాణా కు కేంద్రంగా మారుతోంది. కరోనా నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చాపకింద నీరులా విస్తరించింది. బ్రోకర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి.. విదేశాల నుంచి యువతుల్ని అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జోరుగా సాగాయి. మధ్య కాలంలో …