‘బిర్లా కార్పొరేషన్’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది.
కంపెనీ సాధారణ పోర్ట్ ల్యాండ్ సిమెంట్, ఫ్లై యాష్ ఆధారిత సిమెంట్, పోర్ట్ ల్యాండ్ స్లాగ్ సిమెంట్,సల్ఫేట్ రెసిస్టెంట్ సిమెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. పర్యావరణ అనుకూలమైన జూట్ ఫైబర్ ను తయారు చేస్తున్నది. కుషన్ వినైల్ ఫ్లోరింగ్, PVC షీట్, ఆటోమొబైల్ పరిశ్రమ కోసం డోర్ ట్రిమ్‌ల తయారీలో నిమగ్నమైంది.
దేశీయ సిమెంట్ పరిశ్రమలో అగ్రగామి గా దూసుకుపోతున్నది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మార్కెట్లలో పట్టు సాధించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోనూ పటిష్ట కార్యకలాపాలు కలిగి ఉంది. సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న 15.6 వార్షిక టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025కల్లా 25 వార్షిక టన్నులకు పెంచుకునే యత్నాల్లో ఉంది.
ప్రస్తుతం ఈ షేర్లు రూ. 1463 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిన్న తగ్గిన షేర్ ధర ఇవాళ పెరుగుతోంది. అతి త్వరలోనే రూ.1490 ను దాటి ముందుకు పోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఆకర్షణీయమైన లాభాల కోసం వేచి చూడ వచ్చు. లేదా పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. కొత్త గా కొనుగోలు చేయాలనుకునే వారు కొంత ధర తగ్గినపుడు ఇన్వెస్ట్ చేయవచ్చు.ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ. 1585 కాగా కనిష్ట ధర రూ. 575 మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలమైన షేర్ … అలోచించి మదుపు చేయండి.