Humanoid robot………….
చైనాలోని షాంఘైలో DroidUp అనే స్టార్టప్ కంపెనీ ‘మోయా’ (Moya) పేరిట హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి జీవక్రియలను అనుకరించే హ్యూమనాయిడ్ రోబో ఇది.ఈ రోబో మనిషిలా నవ్వుతుంది..కన్నుగీటుతుంది.తల ఊపుతుంది.,కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది.
సాధారణ రోబోల్లా కాకుండా, దీని శరీరం మనిషిలాగే 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. దీనివల్ల రోబోను తాకినప్పుడు అది చల్లని యంత్రంలా కాకుండా మనిషిని తాకినట్లే వెచ్చగా అనిపిస్తుంది.
మోయా నడక తీరు 92% మనిషి నడకను పోలి ఉంటుంది. ఇది 1.65 మీటర్ల ఎత్తు, 32 కిలోల బరువుతో దాదాపు మనిషి ఆకారంలో ఉంటుంది. ఈ రోబోకి సిలికాన్ చర్మం, అంతర్గత అస్థిపంజరం, కండరాల వ్యవస్థ ఉంటాయి. ఇది ‘ఎంబోడీడ్ AI’ సాంకేతికతతో పనిచేస్తుంది. అంటే తన చుట్టూ ఉన్న వాతావరణాన్నిఅర్థం చేసుకుని, ఆలోచించి, అందుకు తగ్గట్టుగా స్పందిస్తుంది.
దీనిని కేవలం ఫ్యాక్టరీల్లో పని కోసమే కాకుండా.. వైద్యం, విద్య, వృద్ధుల సంరక్షణ వంటి రంగాల్లో తోడుగా ఉండేందుకు డిజైన్ చేశారు. దీని ప్రారంభ ధర సుమారు 1.2 మిలియన్ యువాన్లు (భారతీయ కరెన్సీలో సుమారు ₹1.38 కోట్లు) ఉండవచ్చని అంచనా. ఇది 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ద్రోయిడ్ అప్ సంస్థ అభివృద్ధి చేసిన ‘మోయా’ (Moya) రోబోటిక్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఇది కేవలం పనులు చేసే యంత్రంలా కాకుండా, మనిషికి అత్యంత దగ్గరగా ఉండే బయోమిమెటిక్ (Biomimetic) టెక్నాలజీతో రూపొందించబడింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోయాకు పోటీగా అనేక శక్తివంతమైన హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా అభివృద్ధి చేస్తున్నకొత్త రోబో కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది.దీనిని ప్రధానంగా ఫ్యాక్టరీ పనులు, గృహ అవసరాల కోసం రూపొందిస్తున్నారు. దీని అంచనా ధర సుమారు $20,000 – $30,000 (సుమారు ₹16-25 లక్షలు) ఉండొచ్చు.
Figure AI సంస్థ కూడా కొత్త రకం రోబోను విడుదల చేసింది. ఇది గృహ అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.ఇది స్వయంగా పరుగు దీస్తుంది. చాలా వేగంగా స్పందిస్తుంది. మరో చైనీస్ స్టార్టప్ యూనిట్రీ అభివృద్ధి చేసిన రోబో చాలా సరసమైన ధరకే లభిస్తోంది. ఇది అత్యంత వేగంగా కదలడమే కాకుండా, విన్యాసాలు (Acrobatics) కూడా చేస్తుంది.
అత్యంత చురుకైన (Athletic) రోబో కూడా రాబోతోంది. ఎలక్ట్రిక్ వెర్షన్ రోబోలు చాలా సంక్లిష్టమైన పనులను సునాయాసంగా చేసేలా రూపొందిస్తున్నారు. మోయా ప్రధానంగా ‘సామాజిక, భావోద్వేగ అనుబంధం’ (Social Interaction) పై దృష్టి పెట్టగా, ఇతర సంస్థలు ‘పని సామర్థ్యం’ (Efficiency) పై దృష్టి సారిస్తున్నాయి. ఈ రోబోలన్నీ కూడా సామాన్యులు కొనలేని అధిక ధరల్లోనే ఉన్నాయి.

