Special facilities for prisoners.........................
ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు వారిని వీఐపీలుగా పరిగణిస్తారా?.. అలా చేస్తే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు? తదితర విషయాలు తెలుసుకుందాం. 1894 లో ప్రిజన్స్ యాక్ట్ అమలులోకి వచ్చింది.తర్వాత కాలంలో ఆ చట్టానికి మార్పులు చేర్పులు జరిగాయి.. అయితే జైళ్ల శాఖ మ్యానువల్ లో ఎక్కడ వీఐపీ … ప్రత్యేక సౌకర్యాలు అని ఎక్కడ ఉండదు. అయితే ఖైదీకి ఉన్న ఆర్ధిక స్థాయి స్తోమత , జీవన శైలి , హొదా ను వంటి అంశాలను పరిశీలించి స్పెషల్ క్లాస్ ఖైదీగా పరిగణిస్తారు. . న్యాయస్థానం కూడా వ్యక్తులను బట్టి అనుమతి ఇస్తుంది.
లేదా ఖైదీయే ప్రత్యేక అనుమతిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానం ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తే జైలులో ప్రత్యక గది బెడ్ , రైటింగ్ టేబుల్ , అల్మారా , ఏసీ ,ఫ్రిజ్ ,టివి లాంటి సౌకార్యాలు కల్పిస్తారు.ప్రత్యేక ఖైదీ ఇంటి నుండి సరుకులు తెపించుకొని జైలులో వండించుకొని తినొచ్చు. వంట మనిషినికూడా జైలు అధికారులు కేటాయిస్తారు. లేదా న్యాయస్థానం అనుమతితో ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చు.
జైళ్లలో ప్రముఖుల కోసం ప్రత్యక బ్యారెక్స్ ఉంటాయి. వాటిలో ఉండే ప్రత్యేక గదులను వారికి కేటాయిస్తారు. విఐపిలకు స్పెషల్ సౌకర్యాలు కల్పించాలనే నిబంధన జైళ్ల శాఖ పరిధిలోని అంశం కాదని ,కోర్టు అనుమతితోనే ప్రత్యక సౌకర్యాలు కల్పిస్తారు. వారికి కేటాయించే గదులకు ఎటాచ్డ్ బాత్ రూమ్స్ ఉంటాయి . వారి దుస్తులు ఉతికేందుకూ కూడా మనిషిని కేటాయిస్తారు.
స్పెషల్ క్లాస్ అనేది అడిగిన వారి అందరికి ఇవ్వకపోవచ్చు. దీనికి కావాల్సిన పేపర్స్ కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐటి రిటన్స్ సహా పలు డాకుమెంట్స్ ఇవ్వాలి. కొంతమంది ప్రముఖుల విషయంలో న్యాయవాది వినతిపై కూడా స్పెషల్ క్లాస్ ఇవ్వవచ్చు. ప్రముఖులు జైలులో ఖైదీలుగా ఉన్న సమయంలో వారి భద్రత విషయంలో ఆందోళన ఉంటుంది.
కానీ ఒక్కసారి జైలులోకి ప్రవేశించిన తర్వాత వారి భద్రత చూడాల్సిన బాధ్యత జైళ్ల శాఖ దే. ప్రత్యేక ఖైదీకి అంతకుముందు ప్రభుతం కేటాయించిన గన్మెన్ లను, వ్యక్తిగత భద్రత సిబ్బందిని జైలులోకి రానివ్వరు. ఆయుధాలతో జైలులోకి రావడం చట్టవిరుద్దం కావడంతో భద్రత సిబ్బందిని జైలులోకి రానివ్వరు. చట్టం ముందు అందరు సమానమే అయినపుడు వీఐపీలకు ఈ ప్రత్యేక సౌకర్యాలు ఎందుకనే విమర్శలు లేకపోలేదు. ఇలా ప్రత్యేక వసతులు కల్పించినపుడు ఖైదీ జైళ్ల శాఖకు నెలవారీ అద్దె కట్టాల్సిఉంటుంది. అద్దె భారీగానే ఉంటుంది .
కాగా కొద్దీ రోజుల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది. జైలుకు ప్రత్యకంగా ఇంటి నుండి భోజనం , మందులు తెపించుకునేందుకు విజయవాడ ఎసిబి కోర్టు అనుమతిని కూడా మంజూరు చేసింది. స్పెషల్ క్లాస్ కల్పించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బాబు కి ప్రత్యేక బ్యారక్ కేటాయించారు.