పూరీ,కాశీ, అయోధ్య సందర్శనకు స్పెషల్ ట్రైన్స్!

Sharing is Caring...

Special trains …………………………….
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది.. తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది.

ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్ 18న ఈ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరబోతున్నాయి. మార్చి 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరే ఈ ప్రత్యేక రైలు.. ఎనిమిది రోజుల పాటు పూరీ, కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ మీదుగా ప్రయాణించి తిరిగి 26న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఇక ఏప్రిల్ 18న బయల్దేరే రెండో రైలు మధ్యాహ్నం 12  గంటలకు బయల్దేరి ప్యాకేజీలో దర్శనీయ ప్రాంతాలను చుట్టేసి ఏప్రిల్ 25న రాత్రి 11గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది .
ఈ ప్రయాణ మార్గంలో కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగుతుంది.

ఈ రైల్లో మొత్తం 700 సీట్లు ఉంటాయి. 460 స్లీపర్ బెర్త్ లు, 192 థర్డ్ ఏసీ బెర్త్ లు, 48 సెకండ్ ఏసీ బెర్త్ లు ఉంటాయి. ఈ యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసి – కాశీ విశ్వనాథ్ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరం దర్శనాలు ఉంటాయి.

మొదటి రైలుకు 90శాతం సీట్లు బుక్ అయ్యాయి. రెండవ రైలులో కూడా 20శాతం సీట్లు రిజర్వ్ అయ్యాయి.ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా నిర్ణయించారు. స్లీపర్ తరగతి (ఎకానమీ)లో టికెట్ ధర ఒకరికి రూ . 15,300గా నిర్ణయించారు. 24,085 (థర్డ్ ఏసీ), 31,500 (సెకండ్ ఏసీ) కాగా.. డబుల్/ట్రిపుల్ షేర్ రూ. 13,955 (స్లీపర్) 22, 510 (థర్డ్ ఏసీ), రూ. 29, 615 (సెకండ్ ఏసీ)గా నిర్ణయించారు.

అదే 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకైతే ఈ ధరలు వరుసగా రూ. 13,060, రూ. 21,460, 228,360 చొప్పున ఉన్నాయి. యాత్రికులు ప్రయాణించే తరగతులను బట్టి వారికి గదుల కేటాయింపు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఈ యాత్ర రైలులో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే) అందిస్తారు.

ప్రయాణికులకు బీమా సౌకర్యం ఉంటుంది. ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావు.  వాటికి  పర్యాటకులు అదనంగా చెల్లించాల్సిందే.
క్యాన్సిలేషన్ పాలసీ కూడా ఉన్నది. వివరాలకు  ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ను చూడండి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!