Hot Topic ………………………………….
ఈ మధ్యన స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వాల్ పైన ఏ పోస్ట్ కనిపించినా అది సంచలనమే అవుతున్నది. అసలు విషయంలో కొస్తే సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం లో ఇప్పటికీ సమంతను దూషిస్తున్నారు. పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అభిమానులు కానీ మరెవరైనా కానీ మరీ పర్సనల్ విషయాల్లోకి దూరి విమర్శలు చేయడం మంచిది కాదు.
అయితే సోషల్ మీడియాలో జనాలు ఇందుకు అతీతం. సెలెబ్రిటీల వ్యవహారాల్లో జొరబడి ఏది పడితే అది రాసేస్తుంటారు. వారికి అదొక ఆనందం. అదొక క్రీడ లాంటిది. ఆలా పిచ్చ కామెంట్లు చేసి మానసికంగా ఆనంద పడుతుంటారు. సమంత -చైతూలు ఎంతో అన్యోన్యంగా ఉన్నజంట . అసలు ఆ ఇద్దరు విడాకులు ఎందుకు తీసుకున్నారనే సంగతి ఇప్పటికీ హాట్ టాపిక్. అయినప్పటికీ వాస్తవం ఎవరికి తెలీదు.విడాకుల వ్యవహారంలో చై-సామ్ ఇంత వరకు పెదవి విప్పలేదు.
తెర ముందు జరిగినవన్నీ ఊహాగానాలే. ఇద్దరికీ ఏదో వ్యవహారంలో చెడింది.కలసి ఉండ లేమనుకున్నారు. విడిపోయారు. మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికారు. ఆ విషయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిజానిజాలు తెలిస్తేనే కానీ ఎవరిది తప్పు ?ఎవరి ఒప్పు చెప్పలేం. అయినా చెప్పడానికి మనం ఎవరం ?? అవన్నీ పక్కన బెడితే .. ఏమీ తెలీకుండానే .. సమంతనే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం మరీ ఘోరం.
తాజాగా ఓ నెటిజన్ సమంతను..’విడాకులు తీసుకొని పాడైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటెం’ అంటూ పరుష పదాలతో దారుణంగా దూషించాడు. అంతే కాకుండా జెంటిల్మెన్(నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్ చేశాడు. ఈ మాటలు ఎంతవరకు సమంజసం ? అసలు ఏమీ తెలీకుండానే ఎలా పడితే అలా మాట్లాడటానికి /ట్వీట్ చేయడానికి చేతులు ఎలా వస్తాయి ? అవతలివారు ఎంత హార్ట్ అవుతారో కనీసం ఆలోచన చేయాలి కదా?
ఆ కామెంట్ కు బదులిచ్చిన సమంత అతగాడిలా రెచ్చిపోలేదు. జంటిల్ గా… కూల్ గా సమాధానం ఇచ్చింది. “నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక “అంటూ తనదైన శైలిలో జవాబు ఇచ్చింది. ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. పుష్ప సినిమా కోసం సమంత చేసిన తొలి ఐటెమ్ సాంగ్ పై విమర్శలు వస్తోన్న నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఈ కామెంట్ చేసాడు..