విద్రోహమా?వైపరీత్యమా?

Sharing is Caring...

Sheik Sadiq Ali……………………………………………

‘భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర’ అంటూ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశం కాదు.సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.నిజంగానే ఇలా కృత్రిమ వైపరీత్యాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అందుబాటులో ఉంది. 

సూపర్ కంప్యూటర్,శాటిలైట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటం ద్వారా కృత్రిమంగా సునామీలు, భూకంపాలు,వర్షాలు సృష్టించటం సాధ్యమే.దీనికి సంబంధించిన విస్తృత సమాచారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది.ఇది ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది కాదు.

గత నాలుగైదు దశాబ్దాలుగా వీటిమీద ప్రయోగాలు,పరిశోధనలు జరుగుతున్నాయి.ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా జరిగిన అనేక ఉపద్రవాలకు ఇప్పటి వరకు సైంటిస్టులు సరైన వివరణలు ఇవ్వలేకపోయారు.ఇండోనేషియా కేంద్రంగా సముద్రంలో జరుగుతున్న విస్ఫొటనాలు, సునామీలకు శాస్త్రీయంగా,ఆమోదయోగ్యమైన వివరణ ఇంతవరకూ రాలేదు.

కేదార్ నాధ్ అకాల వర్షాలు,వరదలకు వివిధ కారణాలు చెప్తున్నారు.కానీ నిజమైన కారణం తెలిసిందా?భారత వాణిజ్య రాజధాని ముంబయి వరదలకు,దక్షిణ భారత మహానగరం చెన్నై వరదల వెనుక కుట్రకోణం మీద చర్చ జరగలేదా?భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగే శక్తి ఉన్న భారత్ ను ఎదగనీయకుండా ప్రకృతి ని అడ్డం పెట్టుకొని దొంగదెబ్బ తీస్తున్న దృష్టాంతాలు లేవా?

ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన ఆరోపణ పూర్తిగా సంబద్ధమే.దీని మీద పాజిటివ్ గా చర్చ జరగాలి. 2013లో ప్రముఖ రచయిత డాన్ బ్రౌన్ రాసిన ఇన్ ఫెర్నో నవలలో ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాడు. అదే పుస్తకంలో దీనికి సంబంధించిన సమాచారం ఉన్న లింకులు చాలా ఇచ్చాడు.

కృత్రిమ ఉపద్రవాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం పలు చీకటి సంస్థల దగ్గర ఉంది. దాన్ని చూపించి పలు చిన్న రాజ్యాలను బెదిరించి వందల,వేల కోట్లు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి.అమెరికాతో పాటు పలు ప్రముఖ దేశాల గూఢచార సంస్థలు పరిశోధనలు చేసి రూపొందించిన నివేదికలు కూడా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ మాటల వెనుక ఉన్న సీరియస్ నెస్ గమనించాలి.వేళాకోళంగా తీసుకోవద్దు.నేను కేసీఆర్ మాటల్ని నమ్ముతున్నాను.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!