అంతగా ఆకట్టుకోని షర్మిల ప్రసంగం !

Sharing is Caring...

వై ఎస్ ఆర్  తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగం ఆవేశ భరితంగా ఉంటుందని ఆశించిన ఆ పార్టీ అభిమానులు నిరాశ పడ్డారు. ప్రసంగంలో మంచి అంశాలు ఉన్నప్పటికీ షర్మిల సాదాసీదాగా మాట్లాడి వచ్చిన జనాలను ఉత్తేజ పర్చలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  ప్రసంగం మధ్యలో షర్మిల నవ్వడం మూలానా ఆ ప్రసంగం అంతా నాన్ సీరియస్ గా సాగింది. రాజకీయ నాయకుల ప్రసంగాలు ఉద్రేక, ఉద్వేగ భరితంగా ఉంటేనే కానీ జనాలకు ఎక్కవు. షర్మిల గత ప్రసంగాలకు ఇవాళ్టి ప్రసంగానికి చాలా తేడా ఉంది. కృష్ణా నది జలాలు గురించి మాట్లాడినప్పుడు, కేసీఆర్ పై విమర్శలు చేసినపుడు సీరియస్ నెస్ లేదు.

కృష్ణా నదిపై రెండేళ్లనుంచి ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ కు ఇపుడే తెలివి వచ్చిందా ? అని షర్మిల ప్రశ్నించిన తీరు కూడా చప్పగా ఉంది. మొత్తం ప్రసంగమంతా ఏ పేపర్ చూడకుండా చేసినప్పటికీ మరింత ఆకర్షణీయంగా ఉంటే బాగుండేదని  షర్మిల అభిమానులు అంటున్నారు. పార్టీ ప్రకటించిన తొలి రోజు ప్రసంగమే నీరసంగా ఉంది. గతం లో షర్మిల ఎన్నికల ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.  పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన విధంగా ఇవాళ్టి ప్రసంగం లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది.

వేదిక పై ఒక్కరే ఉండి  చుట్టూ కలయ తిరుగుతూ మాట్లాడటం కౌన్సిలింగ్ లేదా టీచింగ్ విధానంలో బాగుంటుంది.రాజకీయ ఉపన్యాసానికి అంత బాగుండదు.రాజకీయ ఉపన్యాసానికి మోడ్ అఫ్ డెలివరీ యే కీలకం ..  ప్రసంగం అద్భుతంగా లేకపోయినా  కనీసం ఆవేశ భరితంగా లేదా ఉద్వేగ భరితంగా సాగాలి. వాయిస్ లో అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అవేవి లేకుండా షర్మిల ప్రసంగం సాదాసీదాగా సాగింది.

ఉపన్యాసాలు జనాన్ని ప్రభావితం చేస్తాయి. చేయాలి. ఆ ప్రాధమిక అంశం ఇక్కడ షర్మిల మిస్ అయ్యారు. షర్మిల ను ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ  వారు సరిగ్గా గైడ్ చేయలేదు. ఉపన్యాస పాఠం బాగుంది. కానీ ఎఫెక్టీవ్ గా జనంలోకి వెళ్ళలేదు. షర్మిల ప్రసంగాన్ని ప్రత్యర్థులతో పోల్చి చూస్తే చాలా బలహీనంగా ఉన్నట్టే చెప్పుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. అభిప్రాయం  చెప్పే విధానం మారాలి.  స్టయిల్ అఫ్ డెలివరీ ని మార్చుకోవాలి అంటున్నారు. 

—————KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!