అధికారంపై ఆసక్తి లేదు !!

Sharing is Caring...

చాలామంది రాజకీయ నాయకుల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ పలు విషయాలపై స్పందించారు. 

రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే. “అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే  ఎక్కువ దృష్టి పెట్టాను. రాజకీయ నాయకులు అధికారం పొందేందుకు ప్రయత్నిస్తారు. వారు దాని గురించే ఆలోచిస్తారు. ఉదయాన్నే లేచి  అధికారం ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తుంటారు 

అదే ఆలోచనతో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ దేశం మొత్తం అలాంటి నేతలే ఉన్నారు. దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తి గురించి తెలుసు కోవాలని ఎలా అనుకుంటారో నేను ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశం నాకు ఎంతో ప్రేమను అందించింది. అదే సమయంలో ఇక్కడ ద్వేషాన్నికూడా చవి చూశాను.”  అంటూ తన మనసులో మాటలను బయట పెట్టారు.

ఈ సందర్భంగానే గత నెలలో జరిగిన  యూపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. “ఎన్నికల ముందు పొత్తు కోసం  బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించామని రాహుల్ చెప్పుకొచ్చారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశామని వివరించారు.

ఆమె నుంచి ఏ స్పందనా రాలేదని వివరించారు.  ‘ఈసారి ఎన్నికల్లో మాయావతి పోటీ పడలేదు. అది మీరందరు చూసారు. మనం పొత్తు పెట్టుకుందాం.. సీఎం  పదవి మీకే అంటూ ఒక సందేశం పంపాం. కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ ఓడిపోయింది అది వేరే సంగతి. 

కాన్షిరాంజీ ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితుల గళం వినిపించేందుకు ఎంతగానో పోరాటం చేశారు. కానీ మాయావతి  సైలెంట్ అయ్యారు. అందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, పెగాసస్  స్పైవేర్లు వంటి అంశాలు అనుకుంటాను. అందుకే ఆమె గళం విప్పలేదంటూ చెప్పుకొచ్చారు. మాయావతిపై చేసిన విమర్శలకు ఆమె సమాధానం ఏమిటో మరి ? 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!