కాలి నడకన మక్కాకు !

Sharing is Caring...

Fulfilled will………………………………………………

సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్ కు చేరుకున్నారు. ఇరాక్ లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్ ఇతను. పేరు అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు.

ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న అడమ్ మొహమ్మద్.. ఇంగ్లాండ్ లోని వొల్వెరా హంప్టన్ నుంచి సుమారు 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాకు చేరుకున్నారు. 10 నెలలు.. 9 దేశాలు దాటి గమ్యానికి చేరుకున్నారు.అడమ్ మొహమ్మద్.. నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ లెబనా న్, జోర్డన్ దేశాల మీదుగా సౌదీ అరేబియాకు చేరుకున్నారు.

10 నెలల 25 రోజుల్లో మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచారు.ఈయన తన యాత్రను  2021, ఆగస్టు 1న ప్రారంభించి ఈ ఏడాది జూన్లో గమ్యాన్ని చేరుకున్నారు.ఆల్ జజీరా న్యూస్ ప్రకారం.. అడమ్ రోజుకు సగటున 17.8 కిలోమీటర్లు నడిచారు. సామాను మోయడానికి ఒక తోపుడు బండి ని చేయించుకున్నాడు. సుమారు 300 కిలోల సామగ్రితో కూడిన తోపుడు బండిని తోసుకుంటూ తన యాత్రను సాగించారు.

ఆ బండికి మ్యూజిక్ స్పీకర్లు అమర్చి ఇస్లామిక్ పాటలు వింటూ నడిచినట్లు చెప్పుకొచ్చారు అడమ్. శాంతి, సమానత్వంపై ప్రజలకు సందేశం అందించాలనే తాను ఇలా కాలినడకన యాత్ర చేపట్టా అంటున్నారు. ఆన్లైన్ లోనూ గోఫన్ మీ పేజ్ ను ఏర్పాటు చేశారు. ‘ఇది నేను డబ్బు, పేరు కోసం చేయ లేదు. ప్రపంచంలోని మనుషులంతా సమానమనే విషయాన్ని అందరికి తెలియ జేస్తూ యాత్ర సాగించాను అని తన పేజీలో  రాసుకొచ్చారు.

కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ముస్లింలు హజ్ సందర్శించుకునేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. 2020, 2021లో కేవలం సౌదీ అరేబియా పౌరులను మాత్రమే అనుమతించారు. ఈ ఏడాది జులై 7న ఈ హజ్ యాత్ర మొదలైంది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!