ఆధునిక వైద్య విధానాల వెల్లువలో ప్రాచీన కాలపు ప్రకృతి వైద్య విధానాలెన్నో మరుగున పడుతూ వచ్చాయి. అయితే మందుల దుష్ప్రభావాల గురించి అవగాహన పెరిగే కొద్దీ మనిషి మళ్లీ ప్రాచీన చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నాడు. పరిస్థితి సర్జరీదాకా వచ్చినప్పుడు ఆధునిక వైద్యాలు ఎలాగూ తప్పవు. కానీ, మిగతా పరిస్థితుల్లో ప్రకృతి వైద్య విధానాల ద్వారానే సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటివాటిలో మాగ్నెట్ థెరపీ వంటి వైద్య విధానాలతో కొన్ని వ్యాధులను ఇంటివద్దే నయం చేసుకోవచ్చు.
ఈనాటి జీవన సమరంలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, వెరికోస్, సయాటికాతో బాధపడటం సర్వసాధారణం. వీటి నుంచి బయటపడటం కోసం ఎక్కువమంది ఏవేవో మందులు వాడుతుంటారు. ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించుకోవడం కోసం మళ్ళీ వేరే మందులు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మాగ్నటిక్ థెరపీ లో పైన పేర్కొన్న సమస్యలకు మంచి ఉపశమనం దొరుకుతుందని మాగ్నటిక్ థెరపిస్ట్ కుమార్ కడిమిశెట్టి అంటున్నారు. వారి తండ్రి గారైన డాక్టర్ సత్యనారాయణ చిన్నపిల్లల వైద్యునిగా పనిచేశారు. చిన్నపిల్లలకు మాగ్నటిక్ థెరఫీ చికిత్స చేసేవారు. ఆ చికిత్స ద్వారా మంచి ఫలితాలను కూడా సాధించారు. ఆ స్ఫూర్తితోనే కుమార్ కూడా ఈ మాగ్నటిక్ థెరపీ రంగంలోకి ప్రవేశించారు.
అయస్కాంత చికిత్స అతి ప్రాచీనమైనది . ఈ చికిత్స ప్రస్తావన వేదాలలో కూడా ఉందని చెబుతున్నారు కుమార్. గత నలభై యేళ్ల గా ఈ మాగ్నటిక్ థెరఫీలో అధునాతన పరికరాలు వాడుతున్నారు. దీంతో అయస్కాంత చికిత్స మళ్ళీ ప్రాచుర్యంలోకి వస్తున్నదని కుమార్ అంటున్నారు. అయస్కాంత చికిత్స లో సాధారణంగా వాడే అయస్కాంతాల బదులు విద్యుత్ అయస్కాంతాలు మరింత మెరుగైన ఫలితాన్నిస్తున్నాయని కుమార్ వివరించారు. దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి ఈ పరికరాలను కుమార్ తయారు చేస్తున్నారు. వాటిని వైద్యుల పర్యవేక్షణలో పేషంట్లకు ఇస్తున్నారు. పేషంట్లకు ఇచ్చే మందులతోపాటు ఈ కిట్ కూడా ఇచ్చి ఇంట్లోనే వాడుకునే పద్దతిలో ప్రచారం చేస్తున్నారు.
తాను తయారుచేసిన “అన్మోల్ పల్సర్ ” అనే అయస్కాంత చికిత్సా పద్దతి చాలా సులువైనదని …కొద్దిపాటి జాగ్రత్తలతో కుటుంబ వైద్యుని సలహా మేరకు ఇంట్లోనే పేషంట్లు వాడుకోవచ్చని అంటున్నారు. అన్మోల్ పల్సర్ వాడటం వలన శరీరంలో పంచభూతాలలో మొదటి శక్తి అయిన ఆకాష్ (ఈథర్) గుణమైన విద్యుదయస్కాంత తరంగాలు శరీరంలో వుండే విద్యుదయస్కాంత ధర్మం తో పనిచేసి… శరీరంలో ఉన్న పలురకాలైన మలినాలను బయటకు పంపుతాయి. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆహార పదార్ధాల రవాణా , ప్రాణ వాయువు, ఇతర వాయువుల ప్రసరణ చురుకుగా జరుగుతాయి.
అన్మోల్ పల్సర్ వాడటం కూడా సులభమే. మనశరీరంలో 72 వేల నాడులుంటాయి. ఇవన్నీనాభి నుంచి మొదలవుతాయి. సప్తధాతువులు కూడా ఈ నాడీ మండలం తో అనుసంధానమై ఉంటాయి.శరీరం లోని దోష ధాతు మలములు కూడా వీటి పనితీరు పైనే మెలుగుతుంటాయి . అన్మోల్ పల్సర్ లోని భాగాలు రోగి రుగ్మత తీరు,వ్యాప్తిని బట్టి ఆ శరీర భాగం దగ్గర ఉంచినట్లయితే,జీవ విద్యుదయస్కాంత శాస్త్రం ప్రకారం క్షీణించిన కణాలు తిరిగి శక్తి నింపుకుంటాయి. ఇలా జరగటానికి కొంత సమయం పడుతుంది. ఈ పద్ధతి కారణంగా శరీర స్వయం నిర్మాణ వ్యవస్థ మరల శక్తివంతంగా మారుతుంది. అన్మోల్ పల్సర్ తో పాటు ఆ రుగ్మత ను తగ్గించే ఆయుర్వేద మందులు కూడా వాడి నట్టయితే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి.
కొన్ని సందర్భాలలో స్నాయు (లిగమెంట్) దెబ్బతిన్నప్పుడు, మానని పుండ్లు వున్నప్పుడు కూడా అన్మోల్ పల్సర్ చక్కని ఫలితాలు ఇస్తుందని కుమార్ అంటున్నారు.అన్మోల్ పల్సర్ అమెజాన్ వెబ్సైటు లో కూడా లభిస్తుంది. వేరే దేశాలకు సైతం పంపించగలమని కుమార్ చెబుతున్నారు. అన్మోల్ పల్సర్ జీవిత కాలం దాదాపు ఐదు సంవత్సరాలు. ఒక కిట్ ఒక కుటుంబంలోని వారు ఎవరైనా వారి వారి రుగ్మతను బట్టి వారి వైద్యుని పర్యవేక్షణలో వాడుకోవచ్చు. అన్మోల్ పల్సర్ కిట్ లో మొత్తం ఏడు భాగాలుంటాయి. అనారోగ్య పరిస్థితిని పరికరాలను అమర్చుకుని ఇరవై లేక ముఫై నిమిషాలు రెండు మూడు సార్లు వాడాలి. దీర్ఘకాలికంగా మోకాళ్ళ నొప్పులు, వేరికోస్, సయేటికా, మానని పుండ్లు లాంటి సమస్యలు వున్నవారు వారి వైద్యుని సలహా మేరకు వారు వాడుతున్న వైద్య విధానంతో బాటుగా దీనిని వాడవచ్చు.
ఇతర వివరాలకు మాగ్నటిక్ థెరపిస్ట్ కుమార్ ను సంప్రదించవచ్చు … ఫోన్ నంబర్ 9014110759.
—————-KNM