Same facial expressions………………………..
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మంచి నటి. అందులో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది కంగనా నటిస్తోన్న’ ఎమర్జెన్సీ’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందిరా గాంధీ పాత్రకు కంగనా కరెక్ట్ గా సూట్ అయ్యారు.
గతంలో ‘ఆంధీ’ సినిమాలో సుచిత్రా సేన్ ‘బెల్ బాటమ్’ చిత్రంలో లారా దత్తా, ‘బాల్ థాకరే బయోపిక్’ లో అవంతిక, ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రంలో నటి కిషోరి షహానే.. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. వాళ్ళతో పోలిస్తే కంగనా యే బెస్ట్ అనిపిస్తోంది. ఆమె ముఖ కవళికలు ఇందిర ను పోలి ఉండటం ఒక ప్లస్ పాయింట్.
ఈ సినిమా ఇందిర బయోపిక్ కాదని ఎమర్జెన్సీ నాటి ఘటనలతో అల్లుకున్న కథ అని కంగనా అంటోంది. కాంగ్రెస్ నేతలు సినిమా ముందుగా చూపించాలని డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
2014లో కంగనా నటించిన రివాల్వర్ రాణి చిత్రానికి పనిచేసిన దర్శకుడు సాయి కబీర్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారని గతంలో వార్తలు వచ్చాయి.
కానీ కంగనా యే ఈ ‘ఎమర్జెన్సీ’ ని డైరెక్ట్ చేసున్నది. బాలీవుడ్ రచయిత రితేష్ షా ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. కహానీ, పింక్, ఎయిర్‌లిఫ్ట్, రైడ్ వంటి చిత్రాలకు ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు.
ఆయన ఈ సినిమాకు పని చేయడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. కంగనా ఇందిర పాత్రకు న్యాయం చేస్తుందనడంలో సందేహం లేదు కానీ కథ ఎలా ఉంటుంది ?అనేది సస్పెన్సు. కథ ఆకట్టుకునేలా ఉంటే మటుకు కంగనా కు మరో హిట్ ఖాయం అనుకోవచ్చు.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ లో జయ గా నటించి కంగనా ప్రేక్షకులను మెప్పించింది.పాత్రకు తగినట్టు డైలాగ్ డెలివరీ,వాయిస్ మాడ్యులేషన్,మ్యానరిజం ను పట్టుకోవడంలో కంగనా దిట్ట. ఎమెర్జెన్సీ టీజర్ .. ఫోటోలు చూస్తే ఇందిరా గాంధీ పాత్ర లో నూరు శాతం రాణిస్తుంది అని భావించవచ్చు.
బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ ఆమధ్య రష్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని కంగనా
ఒకపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.సినిమా షూటింగ్ ముగింపుకొచ్చింది.ఈ సినిమా వచ్చే నవంబర్ 24 న థియేటర్లలో విడుదల కానుంది.
post updated on… 26-7-2023