MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN IRCTC Tour …………
మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ పేరిట ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని IRCTC అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ రూ.11820 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఈ టూర్ లో మధ్యప్రదేశ్లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని… క్షేత్రాలను దర్శించవచ్చు. అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు.
ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది.యాత్రీకులు తమ వీలుని బట్టి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
DAY…1- బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station) నుంచి సాయంత్రం 4.40 గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్(రైలు నం. 12707)లో టూర్ కు బయలుదేరుతారు. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
DAY..2 – గురువారం ఉదయం 08:15 గంటలకు భోపాల్(Bhopal) రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. స్టేషన్ నుంచి హెూటల్ కి చేరుకుంటారు.హెూటల్ లో ఫ్రెషప్ తర్వాత 40 కిమీ దూరంలో ఉన్న సాంచి స్థూపం సందర్శనకు వెళ్తారు. తర్వాత భోజేశ్వర్ ‘మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి భోపాల్ చేరుకుని -గిరిజన మ్యూజియం విజిట్ చేస్తారు. రాత్రికి భోపాల్ లో బస చేస్తారు.
DAY..3 – శుక్రవారం ఉదయం హెూటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి… చెక్ అవుట్ చేసి ఉజ్జయినికి బయలుదేరతారు.ఉజ్జయినిలో హెూటల్లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత ఉజ్జయినిలోని స్థానిక దేవాలయాలు శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం , నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయం ను సందర్శించుకుంటారు.. రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు.
DAY…4 – శనివారం ఉదయం హెూటల్లో బ్రేక్ ఫాస్ట్ అయ్యాక చెక్ అవుట్ చేస్తారు. అక్కడి నుంచి మహేశ్వర్ కి బయలుదేరి వెళ్తారు. అక్కడ అహల్యా దేవి కోట… నర్మదా ఘాట్ సందర్శించి, అనంతరం ఓంకారేశ్వర్ కి బయలుదేరతారు.అక్కడ హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి ఓంకారేశ్వర్లో బస చేస్తారు.
DAY…5- ఆదివారం ఉదయం హెూటల్లో బ్రేక్ ఫాస్ట్ అయ్యాక చెక్ అవుట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇండోర్ కి బయలుదేరతారు. అక్కడ లాల్ బాగ్ ప్యాలెస్, ఖజ్రానా గణేష్ మందిర్ ను సందర్శిస్తారు. రాత్రి 8:00 గంటలకు ఇండోర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడ రైలు నెం. 19301 రైలు ఎక్కుతారు. రాత్రి అంతా ప్రయాణం చేస్తారు.
DAY..6- సోమవారం రాత్రి 10:00 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.
ఇతర వివరాలకు IRCTC వెబ్సైటు చూడండి.