ఈ స్టోరీ చదివితే .. మనసులో దెయ్యం పారిపోతుంది !

Sharing is Caring...

Are there ghosts……………………………………..

“నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే” అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన  అంతస్తులు సినిమాలోని  పాట వినగానే దెయ్యాలు గుర్తుకొస్తాయి. పాత రోజుల్లో దెయ్యాలు ఊరి శివార్లలో ఉండేవని..అర్థరాత్రి సమయాల్లో సంచరిస్తూ కనిపించిన వారిని భయపెట్టేవని కథలు కథలుగా చెప్పుకునే వారు.

దెయ్యం కథాంశంతో పలువురు దర్శకులు ఇప్పటికీ హారర్‌ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఎన్ని చిత్రాలు వచ్చినా దెయ్యం అంటే ఇప్పటికీ చాలామందికి భయమే.  అర్ధరాత్రి సమయాల్లో కారుచీకట్లో చిన్నవెలుగు కనిపించినా  భయపడుతుంటాం. బాబోయ్‌ దెయ్యం అని పరుగులు తీస్తాం. ఇలా అందరిని భయపెడుతూ చేసుకునే నైట్ ప్రోగ్రాం ఒకటుంది. దాని పేరే  హాలో వీన్‌ నైట్‌’.  ఈ ప్రోగ్రాం లో అందరూ దెయ్యాల గెటప్‌లో సందడి చేస్తుంటారు.

హాలో వీన్‌ నైట్‌ అంటే……….  
‘హాలో వీన్‌ నైట్‌’ జరుపుకోవడం  పాశ్చాత్య సంస్కృతి అని చెప్పుకోవచ్చు.హాలో వీన్ ను ప్రతి ఏటా అక్టోబర్ 31న పండుగలా జరుపుకుంటారు.శతాబ్దాలుగా ఇలాంటి నైట్ కార్యక్రమాలను  విదేశీయులు ఆనందంగా జరుపుకుంటున్నారు.  ఈ నైట్‌ పై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 

హాలో వీన్ రోజున భూలోకానికి దెయ్యాలు తిరిగి వస్తాయని అప్పట్లో నమ్మేవారు. ఆరోజు రాత్రి ఇళ్లను విడిచిపెడితే బయట దెయ్యాలు ఎదురవుతాయని భావించేవారు. ఈ దెయ్యాలు గుర్తించకుండా ఉండటానికి ప్రజలు చీకటి పడిన తరువాత దెయ్యాల మాదిరి మాస్కులు వేసుకుని తిరిగేవారు. అలా చేస్తే దెయ్యాలు తమను తోటి దెయ్యాలుగా భావిస్తాయని అనుకునే వారు. అలాగే అన్నం పెట్టిన గిన్నెలను ఇంటి బయట ఉంచేవారట.

ఇలాంటి కథలు బోలెడు ఉన్నాయి. ఈ హలొ వీన్ యూరోపియన్ సాంప్రదాయాల నుంచి పుట్టుకొచ్చింది. మెల్లగా అన్ని దేశాలకు వ్యాపించింది. మరో కథనం ప్రకారం చనిపోయిన వారి ఆత్మను గౌరవించడానికి, అదే సమయంలో అవి తమనేవీ చేయలేవని చెప్పడానికి ఈ హాలోవీన్‌ సెలబ్రేషన్‌ జరుపుకుంటారని చెబుతారు.

దీనిని నమ్మేవారు ప్రత్యేకంగా ఓ రోజును నిర్ణయించుకుని ఆ రోజు రాత్రి వేడుకలను నిర్వహిస్తారు. రాత్రి సమయంలో తిరిగే భూత ప్రేతాలను భయపెట్టడానికి భయంకరమైన కాస్ట్యూమ్స్‌ను వేసుకుని సందడి చేస్తారు. ఈ పార్టీల్లో కాస్ట్యూమ్స్‌ భయపడేలా ఉంటాయి. దెయ్యం కన్నా భయంకరమైన  వికృత రూపాలను ధరించి ఆనందంగా గడుపుతారు. దెయ్యాలంటే ఉన్న భయాన్ని పోగొట్టే సెలబ్రేషన్ ఇది.

విదేశాలకు పరిమితమైన పాశ్చాత్య సంస్కృతి ప్రస్తుతం ఇపుడు మనదేశానికి కూడా విస్తరించింది. దేశంలోని పలు పబ్‌లు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాగా డబ్బున్నవాళ్ళు .. సెలెబ్రిటీలు ఈ హలొ వీన్ కార్యక్రమాలు జరుపు కుంటున్నారు.అతిధులను, స్నేహితులను, పార్టీకి వచ్చిన వారందరినీ సరదాగా భయపెట్టడమే ఈ పార్టీ ప్రత్యేకత మరి.

ఇలాంటి పార్టీ లలో ఒక్కోసారి అనూహ్యంగా ఘోరాలు నేరాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. సరదా శృతి మించకుండా చూసుకోవాలి. ఒక్కోసారి ఎవరైనా భయపడే ప్రమాదం ఉంది. దెయ్యాలంటే ఉన్న భయాన్ని పోగొట్టే సెలబ్రేషన్ ఇది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!