MAHA KUMBH PUNYA KSHETRA YATRA : ఈ యాత్రలో ప్రయాగరాజ్,అయోధ్య,కాశీ వంటి పుణ్య క్షేత్రాల సందర్శన కోసం IRCTC 8 రోజుల టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ట్రైన్ లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 19-1-25 న యాత్ర మొదలవుతుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.22,940… టూర్ లో సందర్శించే ప్రాంతాలు : వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్.
భారత్ గౌరవ్ ట్రైన్ లో సీట్ల సంఖ్య : 576 (SL: 320, 3AC: 206, 2AC: 50)ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి టూర్ మొదలవుతుంది. భోంగిర్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి (వైజాగ్) విజయనగరం వాసులు కూడా ఆయా స్టేషన్ల నుంచి ఈ ట్రైన్ ఎక్కవచ్చు. అయితే ముందుగా టూర్ టికెట్ బుక్ చేసుకుని ఉండాలి.
ప్యాకేజ్ ధర
ఎకానమీ క్లాస్ లో (Sleepar) – రూ. 22635/ (పెద్దలకు), రూ. 21740/- (పిల్లలు 5-11 సంవత్సరాలు)గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో (3AC)- రూ 31145/- (పెద్దలకు), రూ. 30095/- (పిల్లలు 5-11 సంవత్సరాలు)గా నిర్ణయించారు.కంఫర్ట్ క్లాస్ లో (2AC)- రూ. 38195/- (పెద్దలకు), రూ. 36935/- (పిల్లలు 5-11 సంవత్సరాలు) గా ఫిక్స్ చేశారు
మొదటి రోజు : సికింద్రాబాద్ మధ్యాహ్నం 12:00 గంటలకు యాత్ర మొదలవుతుంది. రెండో రోజు అంతా ప్రయాణం. మూడో రోజువారణాసి చేరుకుంటారు. అక్కడ హోటల్ లో బస ..లంచ్ చేసుకుని ఆలయాల సందర్శన .. గంగా హారతి కార్యక్రమాన్ని తిలకించడం .. తదుపరి హోటల్ కి వచ్చి రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.
నాలుగో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం బస్ లో ప్రయాగ్ రాజ్ వెళతారు. ముందే బుక్ చేసిన గుడారాల్లో వసతి చెక్ చేసుకుంటారు. అక్కడి నుంచి కుంభమేళా స్నానానికి వెళతారు. ఆ కార్యకమాలు పూర్తి అయ్యాక గుడారం లోనే ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.
ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసాక మరల వారణాసి బయలుదేరతారు. వారణాసి లో హోటల్ రూమ్ కి వస్తారు. లంచ్ తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. హోటల్ లోనే రాత్రి డిన్నర్..విశ్రాంతి తీసుకుంటారు.
ఆరోరోజు ఉదయం 07:00 గంటలకు బయలుదేరి మళ్ళీ రైలు ఎక్కుతారు. రైలులో అల్పాహారం.. భోజనం. 12:00 గంటలకు అయోధ్య చేరుకుంటారు. శ్రీ రామజన్మ భూమి, హనుమాన్ గర్హిని సందర్శించుకుంటారు.రాత్రి 22:00 గంటలకు అయోధ్య నుండి రైలు బయలుదేరుతుంది. రైలులో డిన్నర్ చేస్తారు.
ఏడవ రోజు మొత్తం ప్రయాణమే. ఎనిమిదవ రోజు 20.15 కి సికింద్రాబాద్ చేరతారు.దీంతో పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ లో భోజనం, టిఫిన్ ఏర్పాట్లు IRCTC చేస్తుంది. హోటల్ రూమ్స్ బాధ్యత కూడా వారిదే. ఇతర ఖర్చులు యాత్రీకులు భరించాలి. IRCTC సిబ్బంది, సహాయకులు టూర్ పూర్తి అయ్యేవరకు యాత్రీకులతోనే ఉంటారు.
MAHA KUMBH PUNYA KSHETRAYATRA కి సంబంధించి ఇతర వివరాలను కింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG34