ఆకట్టుకుంటున్న’ఈటీవీ’ వెబ్ సిరీస్ ! 

Sharing is Caring...

Priyadarshini Krishna …………………………

ఈటీవీ  OTTలో మెదలు పెట్టిన ‘కథా సుధ’ కొత్త వెబ్‌సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  ఇవి 30 నిముషాల మినీ సీరీస్ లు…. ఏ కథకు ఆ కథ సెపరేట్…మా గురువుగారు రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో కొన్ని కథలు, అలాగే నాకు ఆప్తులు శ్రేయోభిలాషి అవార్డ్ విన్నింగ్‌ డైరెక్టర్ వేగేశ్న సతీష్ గారి వి కొన్ని కథలు రిలీజ్ అయ్యాయి. 

మా గురువు గారి కథల గురించి చెప్పడానికి ఏమీలేదు….ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…’లవ్‌ యు నాయనమ్మ’ అనే కథ కొంతలో కొంత బెటర్…. ఈ కథలో  నానమ్మ- మనవరాలి అనుబంధం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా, నానమ్మను  వృద్ధాశ్రమంలో ఎందుకు చేర్పించాల్సి వచ్చిందో తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నారి ఇచ్చిన సమాధానానికి కళ్లు చెమ్మగిల్లుతాయి. 

ఓ వైపు నానమ్మ .. మనవరాలు బంధాన్ని చూపుతూ .. … మరోవైపు అత్త కోడళ్ల బంధాన్ని ..ఇద్దరి నడుమ  వైరుధ్యాన్నిచూపిస్తూ కథను చెప్పే ప్రయత్నం చేశారు.ఫీల్ గుడ్ క్లైమాక్స్. కన్నవారు భారమయ్యారని అనుకునే వారిని, డబ్బు సంపాదనలో పడి పిల్లలకు దూరం అవుతున్న వారిని కదిలించే కథ.. మిగతావి ఒకే ఇంట్లో చుట్టి పడేసిన కథలే… నటులు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చెప్పుకో తగ్గవి గా లేవు. 

ఇక సతీష్ గారు తీసిన (ఇప్పటి వరకూ విడుదలైనవి) మూడు కూడా చాలా  బాగున్నాయి….మానవ సంబంధాలు, పాతతరం మనస్తత్వాలు, కట్టుబాట్లు, ఆప్యాయతలు, అనుబంధాలు రంగరించిన ఎపిసోడ్స్ ఇవి. 

మొదటి కథ ‘ ఉత్తరం’లో నాయనమ్మ తన మనవరాలికి భర్తకు దూరంగా ఉండేటప్పటి ఎడబాటు, దాని నుండి కలిగే అనుభూతి, అనురాగాలను ఉత్తరాల ద్వారా చెప్పుకునేప్పుడు కలిగే మురిపెం, విరహం వంటి తీపి అనుభూతులను ఇప్పటి తరం వారు ఎలా మిస్సవ్వుతున్నారు లాంటి అంశాలను హృద్యంగా చూపించారు. నాన్నమ్మ చెప్పే జ్ఞాపకాలు చిన్నిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి? ఈ పరిణామాల తర్వాత తన భర్తకు ఫోన్ చేసి ఏం చెప్పింది? అనేది కథలో కీలకాంశం.

రెండో ఎపిసోడ్ ‘వెండి పట్టీలు’ చాలా చాలా బాగుంది…వీరబాబు పాత్రలో బాలాదిత్య తన నటనతో గుండెలు పిండేసాడు… తన బిడ్డ నోరారా అడిగిన వెండి పట్టీలును కొనలేక పోయానే అనే బాధతో అకాలవర్షాలకు పంట నష్టపోయి అప్పుల భారంతో పుట్టెడు దుఃఖంతో నటించిన సీన్లు మనల్ని హత్తుకుంటాయి.

ఆర్తి ఆర్ద్రత తో నిండిన ఈ ఎపిసోడ్ తప్పక చూడాల్సిందే…..కుమార్తె చిరు నవ్వులు చూసేందుకు తల్లి చేసే త్యాగం హృదయాన్ని మెలిపెడుతుంది. వీరబాబు పాత్ర ద్వారా రైతు సమస్యలు తెరపైకి తీసుకొచ్చారు.  ‘రైతే రాజు అంటారు కదా. అంటే నేను రాణి’ అంటూ సీత పాత్ర చెప్పే మాట ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తుంది.

ఇక మూడవది ‘ట్రింగ్‌ ట్రింగ్‌’ కథ ముచ్చటగా సరదాగా సాగిపోయింది…జంట కూడా ముచ్చటగా ఉన్నారు, అంతే ముచ్చటగా నటించి మెప్పించారు…..సతీష్ గారి మార్క్ కుటుంబ విలువలు ప్రేమలు అనురాగాలు అనుబంధాలు ఆర్ద్రత తో పాటుగా పల్లెలు పచ్చదనాలను కూడా చూడవచ్చు….ఫామిలీ మొత్తం కూర్చొని చూడతగ్గ సీరీస్…కమర్షియల్ హంగుల్లేకుండా కథను సూటిగా చెప్పడం, వర్ధమాన నటీనటులు, దర్శకులను ప్రోత్సహించడం ఈ ‘కథా సుధ’ ఉద్దేశం. ఆసక్తి గల ప్రేక్షకులు ఈ సిరీస్ ను చూడవచ్చు .   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!