సూర్యుడు మాయమైతే ??

Sharing is Caring...

With out Sun ………………………………………………

ఇది ఊహాజనితమైన ప్రశ్న .. అయితే  సూర్యగోళం శక్తి హీనమైపోతోందని …  సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (E s A )పరిశోధకులు అంటున్నారు. అదే జరిగితే ఏమి జరుగుతుందని పలువురి ఆందోళన. పరిశోధకుల అంచనాలు ఫలించవచ్చు .. ఫలించకపోవచ్చు. సూర్యుడు శక్తి హీనమైతే  ప్రకృతి జవం ..జీవం కోల్పోతుందని పరిశోధకులు అంటున్నారు.

సూర్యుడు తూర్పున ఉదయిస్తే మనకు రోజు మొదలవుతుంది. పశ్చిమాన అస్తమిస్తే రోజు ముగుస్తుంది. ఎన్నో వేల ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియ అందరికి తెలిసిందే. నిత్యం మనకు కనిపించే సూర్యుడి వయసు  4.57 బిలియన్ సంవత్సరాలు. మరో 4. 57 బిలియన్  సంవత్సరాల వరకు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడని  శాస్త్రజులు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.

ఆ తర్వాత శక్తి హీనమవుతాడని పరిశోధకులు అంటున్నారు. సూరీడు శక్తి హీనమై లేదా వేరే కారణంతో మాయమై పోతే మనం ఏమై పోతాం. అసలు ఈ భూమండలం ఏమవుతుంది? జవాన్ని .. జీవాన్ని అందించే సూర్యుడు హఠాత్తుగా మాయమైతే ? సకల జీవరాశి మనుగడకు తోడ్పడుతున్న సూర్యుడే లేకపోతే ? ఏమి జరుగుతుంది ?

ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి మూలాధారం  సూర్యుడు. అలాంటి సూర్యుడు ఉదయించకపోతే భూమి మొత్తాన్ని చీకట్లు కమ్ముకుంటాయి.  ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించాలంటే  వెలుతురు రిఫ్లెక్ట్ అవ్వాలి.  సూర్యుడు మాయమైతే వెలుగు ఉండదు .. రిఫ్లెక్ట్ అవడం సాధ్యంకాదు.  చీకట్లు కమ్ముకుంటాయ్. ఈ పరిణామం మనిషి మూడ్ ని మార్చేస్తుంది.

టెంపరేచర్ తగ్గడం వల్ల మనుషులు కంగారు పడతారు. భిన్నమైన వాతావరణాన్నితట్టుకోలేరు.  పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. తీవ్రమైన ఉద్వేగాలకు మనిషి లోనవుతాడు.కొన్నాళ్ళకు మనుష్యులు చనిపోవచ్చు.  పిల్లి .. కుక్క.. ఇతర జీవాలు కూడా ప్రాణాలతో ఉండలేక చనిపోతాయి.. సముద్ర ఉపరితలం కూడా మంచుగడ్డగా మారిపోతుంది.  ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు చేరుతుంది.. దీని వల్ల పలు  వ్యాధులు పట్టి పీడిస్తాయి.మంచు మినహ నేల ఉండదు.

ధర్మల్ పవర్ దగ్గర మాత్రమే సూక్ష్మజీవులు ఉంటాయి. ఏడాది వరకూ సూర్యుడు రాకపోతే ఐర్లాండ్, ఐస్ లాండ్ లో మాత్రమే బతకవచ్చు, భూమిపై జియో ధర్మల్ యాక్టివిట్ అక్కడ ఉంటుది అందుకే అక్కడ బ్రతికే అవకాశం ఉంటుంది. మైనస్ 125 డిగ్రీలు వస్తే ఇక్కడ కూడా మనిషి బ్యాక్టిరీయా బతకదు.  ఇక గ్రావిటీ పోతే మాత్రం మనిషి నిలవలేడు.

ఇక మొక్కలు .. ఆకులు వాడిపోతాయి. ఆహరం తయారు చేసుకోలేవు, కిరణ జన్య సంయోగ క్రియ ఆగిపోతుంది. పెద్ద చెట్లకు ఏమి కాదు. 40 డిగ్రీల టెంపరేచర్ కాస్తా 10 లేదా 8 డిగ్రీలకు పతనమవుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది.. సముద్రంలో,నదుల్లో ,చెరువుల్లో  చేపలకు అవసరం అయ్యే ఆక్సిజన్ సయోనా బ్యాకరీయా విడుదల చేయదు. దీంతో 24 గంటల్లో చేపలు చనిపోతాయి.చీకటి 24 గంటల వరకూ అలాగే ఉంటే మైనస్ 17 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోతుంది.

ఉష్ణమండల ప్రాంతాల్లో భూమి నుంచి వేడి బయటకు వస్తుంది.. ఇక్కడ కూడా కేవలం ఒకరోజు మాత్రమే వేడి ఉంటుంది.. ఇక సముద్రాలలో ఉండే నీరు, చెరువులు, నదులలో ఉండే నీరు గడ్డకట్టుకుపోతుంది. త్రాగడానికి  ఏమాత్రం నీరు దొరకదు. సముద్ర ఉపరితలాలు గడ్డకట్టుకుపోతాయి. అంత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒక్క సూక్ష్మజీవులు తప్ప మరే జీవులు కూడా బ్రతకలేవు. అవి కూడా 48 గంటల్లో చనిపోతాయి. పోనీ బ్రతికినా కూడా వాతావరణం సహకరించదు.

సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంటుంది. సూర్యుడు అన్ని గ్రహాలను  తనవైపు ఆకర్షించుకుంటాడు. అందుకే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. అదేంటంటే సూర్యుడు భూమిని ఆకర్షిస్తుంటే మరి భూమి సూర్యునికి దగ్గరగా వెళ్లి సూర్యునిలో కలిసిపోవాలి కదా … కానీ అలా జరగట్లేదు ఎందుకని అంటే భూమి సూర్యునిచేత ఆకర్షించబడుతున్నప్పటికీ ఒక నిర్ణీత కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే సూర్యుని నుండి భూమి ఒక నిర్దిష్ట దూరంలో, నిర్దిష్ట వేగంతో తిరిగేలా సూర్యుని ఆకర్షణ శక్తి పనిచేస్తుంది అని చెప్పుకోవాలి.

ఆస్టరాయిడ్స్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. మన భూమిని నాశనం చేయవచ్చు, రేడియేషన్ కు భూమి గురి అవ్వచ్చు , మరో రెండు మూడు రోజులకు సూర్యుడు వస్తేనే సాధారణం అవుతుంది. లేకపోతే భూమి దాదాపు సంవత్సరం లోపే ముక్కలు ముక్కలు అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకుల అంచనా. అయితే ఇలాంటి పరిస్దితి రాకూడదు అని కోరుకుందాం. శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం  మరో  457 కోట్ల సంవత్సరాల తర్వాత ఇలా జరగవచ్చు. జరగకపోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!