ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త సంచలనానికి తెర లేపారు. హైకోర్టు న్యాయమూర్తు
జగన్ చేసిన ఆరోపణలన్నీ అంత ఆషామాషీవి కాదు. ఆరోపణలకు ఆధారాలను కూడా జతపరిచారట. ఆ ఆరోపణలలో , ఆధారాలలో పస ఎంత అనేది ప్రధాన న్యాయమూర్తి తేల్చాలి. ఈ ఆరోపణలపై సుప్రీం స్పందిస్తుందా ? ఆ స్పందన ఎలా ఉంటుందనేది ఊహా తీతమే. ఒక సీఎం స్థాయిలో ఒక సుప్రీం న్యాయమూర్తి, అందులో మరో ఆరునెలల్లో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోట్ కావాల్సిన వ్యక్తి జస్టిస్ రమణపై ఆరోపణలు చేసినపుడు సుప్రీం స్పందించాల్సిందే. స్పందించకపోతే ఆరోపణలు అన్ని నిజాలు అనుకుంటారు.
ఇక జస్టిస్ రమణ స్పందన కూడా కీలకమే . ఆయన స్పందన ఏమిటనేది కూడా తేలాల్సి ఉంది. సహజంగా న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చినా స్పందించరు. అయితే ఇవి తీవ్ర స్థాయి ఆరోపణలు కాబట్టి రమణ స్పందిస్తారా? లేదా అనేది చూడాలి. జగన్ తన లేఖతో పాటు దమ్మాలపాటి శ్రీనివాస్ జస్టిస్ రమణ కుమార్తెలు జాయింటుగా కలిగివున్న ఆస్తుల వివరాలు కూడా పొందుపరిచారు. అలాగే 2013 ,2016 లో జస్టిస్ రమణ ప్రకటించిన ఆస్తుల వివరాలు , డిక్లరేషన్ పత్రాలను కూడా జతపరిచారు. టీడీపీ హయాంలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ జస్టిస్ రమణతో కలసి ఆస్తులు పోగేసుకున్నారని లేఖలో జగన్ ఆరోపించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి కి ఇచ్చిన అనుకూల తీర్పు కాపీలను కూడా జతపరిచారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. ఆ ఇద్దరి ఆస్తుల వివరాలు కూడా ఇచ్చారంటే విచారణ జరపమనే భావించాలి. సీజే ఈ అంశంపై ఎలా స్పందిస్తారు ? ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
మొత్తం మీద చూస్తే జస్టిస్ రమణ ను టార్గెట్ గా కనిపిస్తోంది. ఒక మాజీ న్యాయమూర్తి సూచనలు ,సలహాలతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మొత్తం వ్యవహారం పై ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ఇవాళ స్పందించే అవకాశం ఉంది.
కాగా రెండురోజుల క్రితం హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ వ్యవస్థలు, వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి .ఏపీలో న్యాయ వ్యవస్థను మూసేయించే లక్ష్యంతో న్యాయవ్యవస్థపై కామెంట్స్ చేస్తున్నారని , సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని న్యాయ మూర్తులు వ్యాఖ్యానించినట్టు కూడా మీడియా లో కొన్ని కథనాలు వచ్చాయి. కావాలంటే తమ తీర్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లండని కూడా జడ్జీలు అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. వాళ్ళు ఆలా అన్నారో లేదో ఆరోజే సుప్రీంకి జగన్ లేఖ రాశారు. ఇపుడు ఈ లేఖ మరెన్ని సంచలనాలకు దారి తీస్తుందో . ఏ పరిణామాలు తలెత్తుతాయో చూడాలి. తమాషా ఏమిటంటే ఈ నాడు , ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించలేదు.
Read also >>>>>> తారక్ కి రాజకీయాల పట్ల ఆసక్తి లేదా ?
——— KNMURTHY
దమ్మున్న చర్య…. మరి దమ్మున్న ఛానల్ ABN ఏమని రాస్తుందో చూడాలి ! యెల్లో మీడియా కక్కే విషం యే స్థాయిలో ఉంటుందో కూడా గమనించాలి ! * జగన్‌ని under estimate చేయడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు ( రైట్ ? ) ! సుప్రీం కరెక్ట్ గా యిప్పుడు కూడా స్పందించక పోతే యీ దేశంలో న్యాయం సరైన మార్గం లో లేనట్టే !