Bollywood He-Man…………….
రొమాంటిక్ హీరోగా , తరువాత అనేక సినిమాలు చేసి హిందీ ఇండస్ట్రీలో హీమాన్ గా పేరు పొందారు. ఇక అలాంటి హీరో పర్సనల్ లైఫ్ లోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
ఫిలింఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికైన ధర్మేంద్ర సినిమాల్లో చేసేందుకు పంజాబ్ నుంచి ముంబై వచ్చేశారు. ధర్మేంద్ర అసలుపేరు దరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లోని నస్రలీ అనే గ్రామంలో కేవల్ సింగ్ డియోల్, సత్యంత్ కౌర్ దంపతులకు 1935 డిసెంబర్ 6న పుట్టారు.
లుధియానాలోని పఖోవాల్ దగ్గర్లో గల డంగన్ అనే గ్రామం వారి పూర్వీకులది.
ధర్మేంద్ర చిన్న తనంలో లుధియానాలోని లాట్టన్ కలన్ గ్రామంలో వాళ్ళ నాన్న ప్రధానోపాద్యాయునిగా చేసేవారు. ధర్మేంద్ర మాధ్యమిక విద్య నభ్యసించారు. తరువాత ఫగ్వారాలో రాంగర్హియా లో మెట్రిక్ లేషన్ చేశారు.
అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ అనే చిత్రంతో 1960లో తెరంగేట్రం చేశారు ధర్మేంద్ర.1961లో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఆయన. 1960-67 మధ్య నటించిన చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర.
నూతన్ తీసిన సూరత్ ఔర్ సీరత్, బాందినీ, దిల్ నే ఫిర్ యాద్ కియా, దుల్హన్ ఏక్ రాత్ కీ, అన్పధ్, పూజా కే ఫూల్), బెహ్రన్ ఫిర్ భీ ఆయేంగే, ఆయే మిలన్ కి బేలా, మై భీ లడ్కీ హూ, కాజల్ పూర్ణిమా, ఫూల్ ఔర్ పత్తర్, వంటి చిత్రాల్లో సహాయ నటునిగా నటించారు. 1966 ఫూల్ ఔర్ పత్తర్ చిత్రంలో మొదటిసారిగా సోలో హీరోగా చేశారు ధర్మేంద్ర. ఆ ఏడాదికి గాను ఫూల్ ఔర్ పత్తర్ చిత్రం అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
1971లో ఆయన నటించిన మేరా గోయన్ మేరా దేశ్ చిత్రంతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఒక పక్కన రొమాంటిక్ పాత్రల్లో చేస్తూనే యాక్షన్ సినిమాల్లో నటించడంతో 1975 నాటికి వైవిధ్యభరితమైన కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర.
రాజా జానీ, సీతా ఔర్ గీతా, షరఫత్, నయా జమానా, పత్తర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, జగ్ను, దొస్త్, చరస్, మా, చాచా భటిజా, ఆజాద్, షోలే వంటి చిత్రాల్లో జంటగా నటించారు వీరిద్దరు. హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మేంద్ర నటించిన సత్యకామ్ చిత్రానికి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
తరువాత నటించిన షోలే సినిమా ఇండియా టైమ్స్ “25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ చిత్రాల” జాబితాలో చేరింది. 1976-84 మధ్య ధరమ్ వీర్, చరస్, ఆజాద్, కటిలన్ కే కాటిల్, గజబ్, రాజ్ పుత్, భగవత్, జానీ దోస్త్, ధరమ్ ఔర్ కానూన్, మై ఇంతెకం లూంగా, జానే నహీ దూంగా, హుకుమత్, రాజ్ తిలక్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించిన ఆయన యాక్షన్ హీరోగా ప్రసిద్ధి గాంచారు.
ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం.
దర్శకుడు అర్జున్ హింగోరానీ దర్శకత్వంలో ఎన్నో చిత్రాల్లో నటించారు ఆయన. కబ్? క్యూ? ఔర్ కహా?, కహానీ కిస్మత్ కీ, ఖేల్ ఖిలారీ కా, కటిలన్ కే కాటిల్, కౌన్ కరే కుర్బానే, సుల్తనట్, కరిష్మా కుద్రత్ కా వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినవే.
కౌన్ కరే కుర్బానే, సుల్తనట్ సినిమాలకు అర్జున్ నిర్మాత కూడా. దర్శకుడు ప్రమోద్ చక్రవర్తీ దర్శకత్వంలో నయా జమానా, డ్రీం గర్ల్, అజాద్, జగ్ను వంటి చిత్రాల్లో నటించారు.. 1969 లో ధర్మేంద్ర యాకీన్ చిత్రంలో హీరోగా విలన్ గా రెండు పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. దాని తరువాత 1972 లో సమాధి, గజబ్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. 1979 లో జీరోషాన్ సే అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేవారు.
తన మాతృ భాష అయిన పంజీబీలో కంకన్ దే ఓలే లో గెస్ట్ పాత్రలో నటించారు.. దోషేర్, దుఖ్, బంజన్ తేరా నామ్ , కుర్బానీ జట్ దీ వంటి సినిమాల్లో నటించారు. తరువాత 1980 నుండి 90 వరకు సహాయ పాత్రల్లో చేశారు.
1997 లో ఆయనకు ఫిలిం ఫేర్ జీవిత పురస్కారం ఇచ్చినప్పుడు దిలీప్ కుమార్, ఆయన భార్య సైరా భాను నుంచి ఈ పురస్కారం అందుకుంటూ ధర్మేంద్ర ఉద్వేగానికి లోనయ్యారు. వందకు పైగా విజయవంతమైన సినిమాల్లో నటించినా కూడా నాకు ఈ పురస్కారం రాలేదు. ఇప్పుడు ఈ పురస్కారం అందుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారాయన.
నటి హేమమాలిని తో కలిసి తుమ్ హసీన్మే జవాన్, దో చోర్, చుప్కే చుప్కే, దిల్లగీ, నౌకర్ బీవీ కా వంటి హాస్యరసప్రదానమైన చిత్రాల్లో నటించడం ద్వారా వారు విజయవంతమైన జంటగా పేరు పొందారు.
‘తుమ్ హసీన్ మెయిన్ జవాన్’ షూటింగ్ సమయంలో ధర్మేంద్ర హేమమాలిని మొదటిసారి కలుసుకున్నారు. ఆ సినిమా నిర్మాణ సమయంలో ప్రేమలో పడ్డారు.
ధర్మేంద్ర తన 19వ ఏట 1954లో సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ కౌర్ ని మొదటి వివాహం చేసుకున్నారు.. సన్నీ డియోల్ , బాబీ డియోల్ అనే ఇద్దరు మగ పిల్లలు విజిత డియోల్, అజితా డియోల్ అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు.
ధర్మేంద్ర ఇంట్లో చెబితే విడాకులు ఇవ్వడానికి ప్రకాష్ కౌర్ అంగీకరించలేదు. ఇటు భార్యను .. అటు ప్రియురాలిని వదులుకోలేక ధర్మేంద్ర కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. చివరికి ఇద్దరు ధైర్యం చేసి ఇస్లాం మతం స్వీకరించి పెళ్లి చేసుకున్నారు.
అప్పటి నుంచి ధర్మేంద్ర రెండు కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఆ పెళ్లిలో లొసుగులు ఉన్నాయని .. కోర్టుకు వెళ్ళమని కౌర్ కు బంధువులు సూచించారు. కానీ మధ్యవర్తులు రాజీ కుదిర్చారు.మొదట్లో ప్రకాష్ కౌర్ గొడవ చేసినా తర్వాత పిల్లల భవిష్యత్ కోసం రాజీ పడ్డారు.
ధర్మేంద్ర కొడుకు బాబీ డియోల్ ఒకసారి హేమమాలినిపై దాడి చేయబోయాడనే పుకార్లు వచ్చాయి. మొదట్లో కొన్ని గొడవలు జరిగినా తర్వాత అన్ని సర్దుకున్నాయి. ధర్మేంద్ర కూడా మొదటి ఫ్యామిలీ ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకున్నారు. హేమ కు కూడా ఈషా ,అహానా అనే ఇద్దరు అమ్మాయిలున్నారు.
దర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, తో పాటు కూతురు ఇషా డియోల్ కూడా హిందీ చలన చిత్ర పరిశ్రమలో నటులు గా కొనసాగుతున్నారు.
1983లో, ధర్మేంద్ర విజయ్తా ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. 1983లో తమ సంస్తలో ఆయన పెద్ద కుమారుడు సన్నీ డియోల్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ బేతాబ్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది.
1990 లో సన్నీ కథానాయకుడిగా ఘాయల్ నిర్మించాడు. ఈ చిత్రం ఉత్తమ ఫిలింఫేర్ చిత్రం అవార్డును గెలుచుకుంది. దానితో పాటు ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సంపాదించుకుంది. 1995 లో చిన్న కుమారుడు బాబీ డియోల్ ను పరిచయం చేస్తూ ఘాయల్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా సుపర్‌హిట్ అయింది.
ధర్మేంద్ర కి 13 మంది మనవళ్లు ,మనవరాళ్లు ఉండటం విశేషం. ధర్మేంద్ర మనవడు, బాబీ డియోల్ కుమారుడు కు, ధర్మేంద్ర పేరు వచ్చేటట్టు “ధరమ్ సింగ్ డియోల్” అని పేరు పెట్టారు. 2019లో, ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ పాల్ పల్ దిల్ కే పాస్‌తో అరంగేట్రం చేశారు.
2004 నుండి 2009 వరకు రాజస్థాన్‌లోని బికనీర్‌కు భారతీయ జనతా పార్టీ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. 2017 లో భారత ప్రభుత్వం .. భారత దేశపు అత్యున్నత మూడవ పురస్కారమైన పద్మభూషణ్ ను ఇచ్చి గౌరవించింది.2020 లో, యునైటెడ్ స్టేట్స్ లోని న్యూజెర్సీ రాష్ట్రం అతన్ని “జీవిత సాఫల్య పురస్కారం” తో సత్కరించింది. వీటితో పాటు ఆయన చాలా అవార్డులు అందుకున్నారు.
ఆయన 1973లో నటించిన యాదోంకి బారాత్ సినిమాను తెలుగు లో యస్.డి.లాల్ దర్శకత్వంలో యన్.టి.ఆర్ కథానాయకుడిగా 1975లో అన్నదమ్ముల అనుబంధంగా విడుదలైంది. ఈ సినిమాలో యన్.టి.ఆర్ తో పాటు బాలకృష్ణ, మురళీ మోహన్ లు నటించారు.
ప్రతిష్టాత్మక చిత్రం షోలే సినిమాలో అమితాబ్‌ను రెకమెండ్ చేసింది ధర్మేంద్రనే .. తరువాతి కాలంలో అమితాబ్ ధర్మేంద్ర కంటే పెద్ద స్థానానికి ఎదిగాడు.ఇదీ అలనాటి రొమాంటిక్ హీరో ధర్మేంద్ర జీవిత చరిత్ర.

