తిరుమల వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

Sharing is Caring...

IRCTC గోవిందం టూర్ …………………

ఈ వేసవి లో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే ఈ IRCTC టూర్  ప్యాకేజీ  మీకోసమే. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు ‘గోవిందం టూర్’. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. ఈ IRCTC గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది.

ఎవరైనా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ గోవిందం టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి వెళ్లే భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు.

ఈ టూర్ ప్యాకేజీ లో మొదటి రోజు భక్తులు 12734 నెంబర్ ట్రైన్ ఎక్కాలి. సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో ఈ రైలు స్టార్ట్ అవుతుంది. 6.10 గంటలకు సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. నల్గొండకు 7. 38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా రైలు ప్రయాణం సాగుతుంది. 

రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి  హోటల్ కు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలు దేరుతారు. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. తరువాత భోజనం సొంత ఖర్చుతో చేయాలి. సాయంకాలం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ఉన్న ట్రైన్ ఎక్కుతారు.మరుసటి రోజు తెల్లవారు జామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 7 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రైలు లింగపల్లికి వెళుతుంది. దీంతో ‘గోవిందం టూర్’ ముగుస్తుంది.

NOTE …  యాత్రికులు/పర్యాటకులు ప్యాకేజీ బుక్ చేసుకునే సమయంలో సమర్పించిన ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ అధీకృత ID కార్డును తీసుకెళ్లాలి. దాన్ని చూపకపోతే TTD అధికారులు దర్శనానికి అనుమతించరు.

ఆలయ దర్శనానికి డ్రెస్ కోడ్ పాటించాలి .. పురుషులు: ధోతీ (తెలుపు) చొక్కా లేదా కుర్తా , పైజామా. మహిళలు: చీర లేదా సల్వార్ కమీజ్ .. పల్లు తప్పనిసరి. ఏ వయసువారైనా టీ-షర్టు, జీన్స్ వంటి దుస్తులు ధరించకూడదు.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు రెండు రకాలుగా ఉన్నాయి. ప్యాకేజీలో ప్రయాణీకులకు అందించే సౌకర్యాలు… తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హెూటల్లో బసతో పాటు.. రైల్వే శాఖ వెంకన్న దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని ఏర్పాటు చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ ‘గోవిందం టూర్’ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. దీని ప్రత్యేకత అదే.ఇలాంటి ప్యాకేజీ విజయవాడ నుంచి కూడా అందుబాటులో ఉంది. వెబ్సైటు చూడండి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!