ఫోర్జరీ కేసులో గాంధీ ముని మనవరాలు !

Sharing is Caring...

మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతారామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఇరుక్కున్నారన్నవార్త సంచలనం రేపింది. ఆశిష్ లతా (56) ఒక వ్యాపారిని 3.22 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిందని తేలడంతో డర్బన్ కోర్టు ఈ శిక్ష విధించింది. 6 ఏళ్లుగా ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఇండియా నుంచి మూడు నార కంటైనర్లు వస్తున్నాయని చెప్పి వ్యాపారవేత్త ఎస్ ఆర్ మహారాజ ను ఆశిష్ మోసం చేశారు .

2015 లో న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ కంపెనీ డైరెక్టర్ మహారాజ్ ను కలసి దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్  కోసం నార కంటైనర్లు వస్తున్నాయని .. వాటికి దిగుమతి ఖర్చులు. సుంకాలు చెల్లించడానికి తనకు డబ్బు అవసరమని అడిగారు. అతగాడు ఆశిష్ కు అడ్వాన్స్ గా 62 రాండ్లు చెల్లించాడు. ఆ తర్వాత ఆశిష్ తో సరకు డెలివరీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సందర్భంగా ఆశిష్  ఇచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని తేలడంతో అతగాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో జరిగిన విచారణలో ఆశిష్ ఇచ్చిన పత్రాలు ఫోర్జరీ పత్రాలని తేలింది.కోర్టులో కేసు విచారణ  కాకముందు ఆశిష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో బెయిల్ పై బయటికొచ్చారు.ఇపుడు విచారణ పూర్తి అయి ఏడేళ్లు శిక్ష ఖరారు అయింది.

ఆశిష్ తల్లి ఈలా గాంధీ దక్షిణాఫ్రికాలో హక్కుల కార్యకర్తగా చేసి గొప్ప పేరు సంపాదించారు. దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యురాలిగా 1994 నుంచి 2004 వరకు పనిచేశారు. డర్బన్ టెక్నాలజీ యూనివర్సిటీకి చాలాకాలం ఛాన్సలర్ గా కూడా చేశారు. రాజకీయాల్లోను , సామాజిక సేవల్లోనూ ఆమెకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. భారత్ ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చిసత్కరించింది. ఇక మహాత్మగాంధీ కూడా దక్షిణాఫ్రికాలో పేదల తరపున న్యాయవాదిగా వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆశిష్ ఇలా ఫోర్జరీ .. చీటింగ్ కేసుల్లో ఇరుక్కుని వార్తల్లో కెక్కారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!