Sheik Sadiq Ali………………………………………………..
సంకల్పం ధృడంగా ఉంటే సమస్త ప్రకృతి సహకరిస్తుంది అని బలంగా నమ్ముతుంది కొక్కొండ కపిల దేవి.ఖమ్మం జిల్లా కల్లూరు పంచాయితీ లోని చిన్న గ్రామం ఖాన్ ఖాన్ పేట.అందులో ఓ పూరి గుడిసె.అందులో తళుక్కున మెరిసింది ఓ కోహినూర్ వజ్రం. చదువులో అసాధారణ ప్రతిభ,చక్కటి ముఖవర్ఛస్సు,కొండంత ఆత్మ విశ్వాసం,భవిష్యత్ పట్ల స్పష్టమైన ప్రణాళిక అన్నీ ఉన్నాయి.లేనిదల్లా ఒకటే….డబ్బు. అసలు తనెవరు? తన నేపధ్యం ఏమిటి? తన లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం.
రామచంద్రమూర్తి,అరుణ అనే నిరుపేద దంపతుల ఏకైక సంతానం కపిల.చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి.కల్లూరు సర్కారు బళ్ళో చదివింది.టెన్త్ పరీక్షల్లో స్కూల్ కి మంచి పేరు తెస్తుందని టీచర్లు ఆశలు పెట్టుకున్నారు.సరిగ్గా పదిరోజుల్లో పరీక్షలనగా హఠాత్తుగా తండ్రి మరణించాడు.ఒక్కసారిగా తల్లీకూతుళ్ళు షాక్ కు గురయ్యారు.అయినా కపిల పరిస్థితి అర్ధం చేసుకుంది. గుండె నిబ్బరం చేసుకుంది.పరీక్షలు రాసింది.ఫలితాలు వచ్చాయి.అందరి ఆశలు నిజం చేస్తూ మండలంలో టాపర్ గా నిలిచింది.10కి10 GPA సాధించింది.బాసర IIIT లో సీటు సాధించింది.ఇంటర్ లోనూ అద్భుత ప్రతిభ చూపించింది.ఇప్పుడు అక్కడే బీటెక్ (CSE) ఫస్టియర్ చదువుతుంది.
వరంగల్ కలెక్టర్ గా పనిచేసి,ఇప్పుడు కేంద్ర సర్వీస్ లో ఉన్న ఐ.ఏ.ఎస్.అధికారి కాట ఆమ్రపాలి తనకు ఆదర్శం అంటుంది కపిల. ఆమ్రపాలి మేడం లాగే IAS సాధించాలనీ, నిరుపేదలకు చేయూత నివ్వాలనేది తన జీవితాశయం అని చెబుతోంది కపిల. B. Tech. పూర్తిచేసి రెండేళ్లు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించి వాటితో IAS కు ప్రిపేర్ అయి ఖచ్చితంగా సాధిస్తానని ఘంటాపధంగా చెబుతోంది కపిల.తనతో మాట్లాడిన దరిమిలా ఆమె ఆత్మవిశ్వాసం చూశాక మాకూ అదే బలమైన నమ్మకం ఏర్పడింది. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య ఉంది.
తండ్రి మరణించాక తల్లికి వస్తున్న రెండువేల వితంతు పెన్షన్,ఆ పూరి గుడిసె తప్ప ఏ ఇతర ఆధారం కపిలకు లేదు.బాసరలో చదువుకు ఇబ్బంది లేదు.కానీ ఇతర అవసరాలు చాలా ఉన్నాయి.లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంది.తల్లీకూతుళ్ళు బతకాలి.తనకు బోలెడు పుస్తకాలు కావాలి.కనీసం బట్టలు,మంచి లాప్ టాప్, ఒక మంచి ఫోన్ కావాలి.నాలుగేళ్ళ పాటు తన చదువు కొనసాగాలి. తన లక్ష్య సాధనకు అవసరమైన వనరులు సమకూర్చాలి. ఈ మొత్తం బాధ్యతను తోపుడుబండి తీసుకుంది. తనకు ఒక భరోసాను కల్పించింది. మేము తోడుగా ఉన్నాం .. ఉంటాం అన్న ధీమా కల్పించాం.
కపిల కు సహాయం చేసే లక్ష్యంతో పేస్ బుక్ లో పోస్ట్ పెడితే చాలామంది మిత్రులు సానుకూలంగా స్పందించారు.మన పోస్టులోని తపన అర్ధం చేసుకున్నారు.బెంగుళూరు నుంచి మిత్రుడు నాగలింగ స్పందించి ఫ్లిప్ కార్ట్ లో 12 వేల విలువైన ఫోన్ బుక్ చేసి పంపించారు.అది ఈరోజే కపిలకు అందించాము. మరో ఆత్మీయ మిత్రుడు income tax inspector ప్రహ్లాద్ కూడా స్పందించాడు.కపిల కుటుంబానికి మూడు నెలలకు సరిపడా బియ్యం,నిత్యావసరాలు పంపించారు.అవి కూడా అందించాము.నా ప్రియసోదరుడు, తొలి నుంచీ తోపుడుబండి తో కలిసి నడిచి గ్రూప్ 1 టాపర్ గా నిలిచి ప్రస్తుతం చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్న రమణ ఆకుల స్పందన మరింత ధైర్యాన్నిచ్చింది. కపిల IAS సాధించడానికి మార్గదర్శిగా ఉంటానని,మెంటర్ గా ఉంటూ కపిలను విజేతగా నిలబెడతాననీ మాటిచ్చాడు. స్వచ్చందంగా ముందుకు వచ్చారు.
మరో మిత్రులు లాప్టాప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అదింకా కార్యరూపం దాల్చలేదు.ఆది కూడా సజావుగా జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాము.జులై ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం అయిన పక్షంలో తను తిరిగి హాస్టల్ కు వెళ్ళాలి.కొన్ని పుస్తకాలు కొనుక్కోవాలి.సరైన బట్టలు కూడా లేవు.అవసరమైన కొన్నివస్తువులు కొనుక్కోవాలి. మీరు ఓ చేయి వేయండి .. చదువుల తల్లికి సహాయపడండి.
చదువును ప్రేమించి,ప్రతిభను ప్రోత్సాహించే మిత్రులారా…మీ సహకారాన్ని కోరుతూ…
మీ తోపుడుబండి సాదిక్ & టీమ్
9346108090,7330033330
Account Number : 386705000723
Account Holder’s name : TOPUDU BANDI FOUNDATION
Contact : 7330033330
Ifsc Code : ICIC0003867
UPI ID : 386705000723@ICICI
#sirimuvvalu #topudubandi